Europe: అతి సర్వత్రా వర్జ యేత్ అంటారు. పెద్దలు ఏ ముహూర్తం లో ఈ లోకోక్తిని తెరపైకి తెచ్చారో తెలియదు గాని.. ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి చేసిన అతి వల్ల.. ఇప్పుడు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా మనిషి పుట్టుకకు ప్రధాన కారణమయ్యే వీర్యాన్ని విషం గా మార్చేసింది.
ఇటీవల అంతర్జాతీయ మీడియా నుంచి మొదలుపెడితే జాతీయ మీడియా వరకు ఒక వార్త విపరీతమైన ప్రచారంలో కనిపించింది. ఆ వార్త ప్రకారం ఓ వ్యక్తి తన వీర్యాన్ని విపరీతంగా దానం చేశాడు. అతడు చేసిన దానం వల్ల 200 కుటుంబాలు ఆగాధంలో కూరుకుపోయాయి. అతడు చేసిన దానం అనేకంగా వీర్య బ్యాంకుల పనితీరు పట్ల అనేక సందేహాలను వ్యక్తమయ్యేలా చేసింది.
చాలామంది మహిళలు తమ భర్తల ద్వారా గర్భం దాల్చుతుంటారు. కొంతమందికి ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే వారి భర్తల్లో వీర్యంలో ఉండాల్సిన నాణ్యత ఉండదు. దీనివల్ల వారు గర్భం దాల్చడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వారు దాతల వీర్యం ద్వారా మాతృత్వాన్ని పొందుతారు. అలాంటి వారి అవసరాలు తీర్చడానికి వీర్యం బ్యాంకులు తెరపైకి వచ్చాయి. అయితే డెన్మార్క్ ప్రాంతంలోని యూరోపియన్ వీర్యం బ్యాంకు ఓ వ్యక్తి తన వీర్యాన్ని దానం ఇచ్చాడు. అలా అనేకసార్లు దానం ఇవ్వడం ద్వారా 14 దేశాలలో 200 మంది చిన్నారులు పుట్టారు. ఇప్పుడు వారంతా క్యాన్సర్ బారిన పడ్డారు. కొంతమంది ఇప్పటికే చనిపోయారు. మిగతా మందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఈఘటన తర్వాత ఒక మనిషి వీర్యం ఎంతటి విషమో ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి ఒక వ్యక్తికి సంబంధించిన వీర్యాన్ని ఆ స్థాయిలో సేకరించడమే పెద్ద తప్పు. పైగా ఎటువంటి పరీక్షలు చేయకుండానే ఆ వీర్యాన్ని ఇతర మహిళలలో ప్రవేశపెట్టడం మరింత తప్పు. అందువల్లే దాదాపు 200 మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడ్డారు. ఎందుకంటే ఆ వీర్యం ఇచ్చిన వ్యక్తి జన్యు ఉత్పరివర్తనాలలో క్యాన్సర్ కారకాలున్నాయి. అందువల్లే ఆ చిన్నారులు క్యాన్సర్ బారిన పడ్డారు.
నేటి కాలంలో చాలామంది మహిళలు తమ భర్తల ద్వారా గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే వీర్యం బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. ఐవీఎఫ్ విధానంలో మహిళలకు మాతృత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇది మంచి పరిణామం అయినప్పటికీ.. కొన్ని రకాల పరీక్షలను కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. జన్యు స్క్రీనింగ్ అనేది ఇటీవల కాలంలో విస్తృతంగా మారిపోయినప్పటికీ.. దానివల్ల కొన్ని రకాల రుగ్మతులను.. వ్యాధికారక వేరియంట్లను గుర్తించలేకపోతున్నారు. డెన్మార్క్ లో జరిగిన ఘటనలో కూడా ఇదే నిర్లక్ష్యాన్ని వీర్యం బ్యాంకు నిర్వాహకులు ప్రదర్శించడంతో రెండు వందల మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి.. ఈ పరిణామం నేపథ్యంలోనే ఒక దాత వీర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి వాడాలి? అనే దానిపై ఖచ్చితమైన పరిమితి ఉండాలని వైద్యులు చెబుతున్నారు..
ఉదాహరణకు బ్రిటన్ దేశంలో పదిమంది మహిళలకు మించి ఒక దాత వీర్యాన్ని వాడరు. ఈ నిబంధన కేవలం ఆదేశంలో మాత్రమే ఉంటుంది. బెల్జియంలోనూ ఒక దాత వీర్యాన్ని ఆరుగురు మహిళలు మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఐరోపా ప్రాంతంలో దాతల వీర్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లే ఉన్న దాతల నుంచి ఎక్కువగా వీర్యాన్ని సేకరిస్తున్నారు.
చాలామంది మహిళలు భౌతిక పరమైన ఆకర్షణలకు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అందువల్ల వీర్యం బ్యాంకుల నిర్వాహకులు ఒకే తరహా వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారు. అందువల్లే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయి. డెన్మార్క్ ఘటన తర్వాత.. మరోసారి మనిషి వీర్యానికి సంబంధించి అనేక ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో వీటిని నివృత్తి చేయడానికి, సరి కొత్తగా నిబంధనలు విధించడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.