https://oktelugu.com/

Vikram : విక్రమ్ ఆశలన్నీ తంగలాన్ మీదే…ఇది సక్సెస్ అవ్వకపోతే ఆయన ఇక సినిమాలు చేయరా..?

విక్రమ్ ఎలాంటి సినిమా చేసిన అందులో ఒక జన్యున్ ఎఫర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలను చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 7:38 pm
    Follow us on

    Vikram : తమిళ సినిమా ఇండస్ట్రీలో పైవిద్య భరితమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ‘కమల్ హాసన్’ మొదటి ప్లేస్ లో ఉంటే, ఆయన తర్వాత ప్లేస్ లో ‘విక్రమ్ ‘ ఉంటాడు. ఇక విక్రమ్ ఎంటైర్ కెరియర్లో చేసిన సినిమాల్లో 80% మూవీస్ మొత్తం ప్రయోగాత్మకమైన సినిమాలే కావడం విశేషం. ఇక ఇలాంటి సినిమాలను చేస్తూ ఆయన ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా సక్సెసుల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పాలి. ఇతరులు పోషించిన పాత్రని తను చేయడానికి ఇష్టపడడు. తను చేసిన ప్రతి పాత్రలో తనను తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించుకోకూడదు అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఆయన సినిమా చేయడానికి రంగంలోకి దిగుతాడు. అందువల్లే ఆయన లాంటి నటులు మనకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అయిన పా. రంజిత్ డైరెక్షన్ లో ‘తంగలన్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ ఎట్టకేలకు ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఏది ఏమైనప్పటికీ విక్రమ్ మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక గత చిత్రాలు ఆయన్ని కొత్తవరకూ నిరాశపరచినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడ తగ్గకుండా మరోసారి సాహసం చేయడానికే ఈ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. ఆయన బాడీని మెయింటైన్ చేసే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కి పోతుందనే చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా ఆయన వెయిట్ తగ్గమంటే తగ్గుతాడు, పెరగమంటే పెరుగుతాడు ఒక క్యారెక్టర్ కోసం ఎంతవరకైనా తెగించే హీరో విక్రమ్…

    ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే తంగలన్ సినిమాతో విక్రమ్ హిట్టు కొడితేనే తను మరికొన్ని ప్రయోగాత్మక మైన సినిమాలు చేస్తారని లేకపోతే మాత్రం ఇలాంటి సినిమాలు చేయడం ఆపేస్తాడనే టాక్ అయితే నడుస్తుంది. నిజానికి విక్రమ్ ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన మొదటి నుంచి కూడా సినిమా హిట్ అయిన, ప్లాప్ అయిన సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా తను ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికే ఆసక్తి చూపిస్తానని ఇతరులు చేసిన కథలను చేయడం తనకు ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో తెలియజేశాడు.

    ఇక తను ఏది చేసిన కూడా చాలా స్పెషల్ గా ఉండాలని అనుకుంటాడు. ఇక అందుకోసమే తను ఒక క్యారెక్టర్ కోసం ఎంతటి కష్టాన్నైనా పడతానని ఒక సినిమా కోసం ఎలాంటి ఇబ్బందులైన ఎదుర్కొంటానని తెలియజేశాడు. అయితే పా. రంజిత్ ఈ సినిమాలో విక్రమ్ ని ఒక తెగ కి చెందిన ఒక వ్యక్తిగా చూపిస్తున్నాడు. అయితే విక్రమ్ ని ఆ గెటప్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి ఆయనను చూస్తే అసలు గుర్తుపట్టలేరు. అంతటి మేకోవర్ ను సాధించడం లో విక్రమ్ ను మించిన వారు మరొకరు ఉండరు. అలాగే ఆ పాత్రలో అంతటి గొప్ప నటనను చూపిస్తూ, చేసే వర్క్ పట్ల పాషన్ ఉంటే తప్ప అలా చేయడం చాలా కష్టం అనేలా ఆయన కష్టపడుతూ ఉంటాడు.

    ఇక ఇలాంటి సినిమాలు చేసే హీరోలు గాని, నటులు గాని చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విక్రమ్ ఒకరు. ఇక ఆయన ఈ సినిమా హిట్ అయిన ఫ్లాపైన మరొక ప్రయోగం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ హిట్ అయితే మాత్రం ఆనందంతో సినిమా చేస్తాడు. లేదంటే కొంచెం డల్ అవుతాడు అంతే తప్ప సినిమా చేయడంలో ఆయన మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది…