https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పనున్న పవర్ స్టార్…

పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలి ప్రేమ మొదటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కాగా, ఆ తర్వాత బద్రి, ఖుషి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరో అయ్యాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 / 07:24 PM IST
    Follow us on

    Pawan Kalyan :  ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘జనసేన ‘ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా తను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానంలో 21 స్థానాలను గెలిపించుకున్నాడు. అలాగే రెండు ఎంపీ స్థానాల్లో కూడా గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ ని సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటివరకు ఏ పార్టీకి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. ఇటు రాజకీయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ తన సక్సెస్ ని చూసి చాలామంది మనం కూడా ఏదో ఒక రకంగా కష్టపడి పైకి ఎదగాలనే ఉద్దేశంతో తమ తమ రంగాల్లో తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిజానికైతే కష్టపడితే ఫలితం అనేది దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఒక మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలు ఉన్నాయి ఇక ఈ మూడు సినిమాలు కూడా దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేసుకొని సెట్స్ మీద ఉన్నాయి

    మరి ఈ మూడు సినిమాలు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఎన్నికలు లేకపోతే ‘ ఓజీ ‘ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఇప్పటి వరకు నిర్మాతలు గాని, పవన్ కళ్యాణ్ గాని సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాడు..

    ఇక గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒక మూడు నెలల తర్వాత మళ్లీ సినిమాల మీదికి వస్తానని సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటానని ఒక మీటింగ్ తెలియజేశాడు. అయినప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన మరో మూడు నెలల తర్వాత కూడా సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గత ప్రభుత్వం చేసిన పనులను పరిశీలిస్తూ వాటికి తగ్గ చర్యలను తీసుకుంటూ, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పరిష్కారాన్ని చూపిస్తూనే వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు హత్యాయత్నం జరగబోతుంతుందంటూ వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని పట్టించుకోకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం మరికొన్ని రోజులు రాజకీయాల మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన సినిమా సెట్స్ కి ఎప్పుడు వస్తాడు అనేది తెలియడం లేదు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నాలుగైదు నెలల వరకు సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రొడ్యూసర్స్ వాళ్ళు పెట్టిన సొంత డబ్బులు ఒక ఎత్తైతే, ఫైనాన్సర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ భారీగా పెరిగిపోతుందని తలలు బాదుకుంటున్నారు. కాబట్టి ఈ సినిమాలు హిట్ అయితే పర్లేదు. కానీ ప్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్స్ చాలా దారుణంగా నష్టపోతారు…మరి పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…