Raja Saab Movie Release Date: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా 9 వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్ వచ్చాయి. ఒక్కటి కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వలేదు. నేడు ఈ చిత్రం నుండి ‘సహానా..సహానా’ అనే మెలోడీ సాంగ్ విడుదల కాబోతుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమా కూడా విజువల్స్ ఎఫెక్ట్స్ మరియు రీ రికార్డింగ్ తో సహా సెన్సార్ కాపీ రెడీ అయ్యింది అట. క్రిస్మస్ లోపు అన్ని భాషల్లో సెన్సార్ ని పూర్తి చేయడానికి చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రన్ టైం 3 గంటల 15 నిమిషాలు అట.
ఫైనల్ కట్ జరిగిన తర్వాత 3 గంటల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఔట్పుట్ పై ప్రభాస్ చాలా సంతోషం తో ఉన్నాడని, అందుకే ఈసారి ఆయన ప్రొమోషన్స్ లో చాలా బలంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకు ఉన్నటువంటి ఆర్ధిక సమస్యలు చిక్కుముడి ఇంకా వీడలేదు. ఇందులో భాగస్వామి గా ఉన్నటువంటి IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చివరి నిమిషం లో తప్పుకొని మేము పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేయాలంటూ కోర్టు లో కేసు వేశారు. రీసెంట్ గానే వాళ్ళు పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేసాము కానీ, వడ్డీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది, త్వరలోనే అది కూడా క్లియర్ చేస్తాము అంటూ నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా వడ్డీ కూడా కట్టలేదు.
సినిమాకు బిజినెస్ పూర్తి అయ్యి, బయ్యర్స్ నుండి అడ్వాన్సులు వస్తే, అవి తీసుకొని వడ్డీలు కట్టాలని అనుకున్నాడట నిర్మాత. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం బిజినెస్ ఒక్క సెంటర్ లో కూడా క్లోజ్ అవ్వలేదు. ఆంధ్రా ప్రాంతం మొత్తం మీద, సీడెడ్ ని మినహియిస్తూ 85 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఆశిస్తున్నాడు నిర్మాత. కానీ అంత డబ్బులు ఇచ్చేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపడం లేదు. సీడెడ్, నైజాం బిజినెస్ కూడా ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. బయ్యర్స్ చెప్పే లెక్కలు నిర్మాతకు వర్కౌట్ అవ్వదు, ఆ డబ్బులతో ఆయన వడ్డీలు కట్టుకోలేడు, దీతో ఈ చిత్రం జనవరి 9 విడుదల అవ్వడం దాదాపుగా సాధ్యం కాదు అని అనిపిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో మొదలు పెట్టారు. బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, సినిమాకు డిమాండ్ లేదు అనే విషయం బయ్యర్స్ కి అర్థం అవ్వడంతో నిర్మాత డిమాండ్స్ కి అసలు తలవంచడం లేదు.