Delhi car blast: గత రెండు మూడు రోజుల నుంచి ఆందోళనకారుల వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ ముగ్గురిని అహ్మదాబాద్ లో పట్టుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు డాక్టర్ మొయినొద్దీన్. చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. అతడు ఎవరితో టచ్ లో ఉన్నాడని చూస్తే యూపీ, లకీంపూర్ లలో ఇద్దరితో టచ్ లో ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి అప్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
మొయినొద్దీన్ తన కుట్రలో భాగంగా స్థానిక స్థాయిలో లభించే ఆముదం, కెమికల్ వ్యర్థాలు , ఇతర విషపదార్థాలను ఉపయోగించి “రెసిన్” అనే ప్రాణాంతక విషాన్ని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాన్ని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ఫుడ్ సెంటర్లు వంటి ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో కలిపి, సామూహిక హత్యలకు (మాస్ మర్డర్) పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు సమాచారం.
గుజరాత్ ATS నివేదిక ప్రకారం.. మొయినొద్దీన్ తన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కీలకమైన మూడు నగరాల్లో ‘రెక్కీ’ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లోని రద్దీగా ఉండే ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వాటర్ సప్లై కేంద్రాలు , దేవాలయాల పరిసర ప్రాంతాలను అతను విషం కలిపేందుకు అనుకూలమైన ప్రదేశాలుగా గుర్తించి, పరిశీలించినట్లు తెలిసింది.
ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే.. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
