Operation Sindoor 2.0: ఢిల్లీలోని ఎర్రకోట మొదటి గేటు వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్ సంఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలపై భారత నిఘా బృందం ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇది ఉగ్రవాది దాడినా? లేదా మరి వ్యక్తుల పని అయి ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలు ప్రాంతాల్లో వెంటనే పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మరి ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరగకుండా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ 2.0 అనే పదం ట్రెండీగా మారింది. ఎందుకంటే?
పుల్వామా ఘటన తర్వాత భారత్ సీరియస్ యాక్షన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భాగంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ నిర్వహించే ఈ యుద్ధం కు’ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. పుల్వామా ఘటనలో ఒక మహిళ తన భర్తను కోల్పోయిన చిత్రం దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. ఇకనుంచి ఏ మహిళ బొట్టు తుడిచి పెట్టకుండా కాపాడుతామంటూ నినదిస్తూ ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టారు.
అయితే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 పేరు బాగా వినిపిస్తోంది. అంటే మళ్లీ ఉగ్రవాదులపై దాడి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పుల్వామా ఘటన విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయమే.. ఇప్పుడు కూడా తీసుకోవాలంటూ కొందరు కోరుతున్నారు. ఇది ఉగ్రవాదుల పని అంటూ.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ 2.0. అని పేరు పెట్టి దాడులు చేయాలని నినదిస్తున్నారు. కొందరు ఈ పేరుతో ప్రత్యేకంగా పోస్టల్ లు తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటికి చాలామంది లైక్స్ కొట్టడమే కాకుండా మిలియన్ల కొద్ది షేరింగ్ చేస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే దేశ ప్రజల్లో మరోసారి ఆగ్రహ జ్వాలలు రేకెత్తినట్లు తెలుస్తోంది. అయితే కారు బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత వెంటనే ప్రధానమంత్రి, హోం మంత్రి తో పాటు త్రివిధ దళాలు అప్రమత్తమై సమావేశాలు నిర్వహించాయి. బాబు బ్లాస్ట్ వెనుక ఎవరు ఉన్నారన్నదే కీలకం అని భావిస్తున్నారు. ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే స్పష్టమైన సమాచారం తెలిసిన తర్వాతే నిర్ధారించరున్నారు. అయినా కూడా ఇది ఉగ్రవాదుల పని అన్నట్లు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతుందా? అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇప్పటికే రక్షణ దళాలు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఏ చిన్న అనుమానం వచ్చినా.. అనుమానిత వ్యక్తులు ఎవరైనా సరే విడిచి పెట్టేది లేదని భావిస్తున్నారు. మరి ప్రజలు కోరుతున్నట్లు ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందా? లేదా? చూడాలి.