Rajanikanth Bday Special: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు నేడు. టికెట్ కండక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం అద్భుతం. ఒక్క దక్షిణాదిలోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతంచేసుకున్న నటుడు రజనీ. ఆయన సినిమాలు ఎలాంటి కోణంలోనైనా ఉండనీ.. అందులో ఏదో ఒక జీవిత సత్యాన్ని చెప్తూ.. ప్రేక్షకులకు జ్ఞానబోద చేస్తుంటారు. బాధ, సంతోషం, బంధాలు ఇలా మనిషిని బాధించే విషయాలన్నింటిపై తన సినిమాల ద్వారా రిఫ్లెక్ట్ చేసేలా చేస్తుంటారు. అలా కొన్ని డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా కనిపిస్తే.. మరికొన్ని ఆలోచించేలా చేస్తాయి. అలా జనాల్లో ఇప్పటికీ గుర్తుండిపోయిన ఆయన సినిమాల్లోంచి కొన్ని డైలాగ్‌లు మీ కోసం.
పక్షి గుణమే ఎగరడం రా.. వదిలేయ్ చావో బతుకో అదే తేల్చుకుంటుంది.. నువ్వు పెట్టే ఈ భిక్ష దానికి మరణం కంటే భయంకరం- కబాలి.
అతిగా ఆవేశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు.- నరసిమా సినిమా.
నాన్నా పందులే గుంపులు గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది- శివాజి.
తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత- బాబా
ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా వస్తుంది.? ఏదో నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలింది దానం చేస్తేనే మనశ్శాంతి-ముత్తు
దేవుడు శాసించారు ఈ అరుణాచలం పాటిస్తాడు- అరుణాచలం.
మంచివాడు మొదట కష్టపడచ్చు.. కానీ ఓడిపోడు.. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ కచ్చితంగా ఓడిపోతాడు.-భాష
నేను ఒకసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్లే- భాషా
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rajanikanth super hit dialogues
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com