KGF 2
Tollywood Release Dates: ‘కరోనా’ మూడో వేవ్ పెద్దగా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయానికి వచ్చారు సినిమా వాళ్లు. దాంతో విచ్చలవిడిగా సినిమాల రిలీజ్ డేట్లు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11న థియేటర్లలో ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇక మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘కేజీఎఫ్ -2’. దేశ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా.. ఏప్రిల్ 14న విడుదల చేస్తామని యూనిట్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే డేట్‌కు ఫిక్సయింది. తాజాగా ఉడిపిలోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న యూనిట్.. సినిమాను ‘ఏప్రిల్ 14’నే విడుదల చేస్తామని పేర్కొంది.
KGF 2
Also Read: ఆ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి.. రష్మీలో విప్లవం !
ఇక మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీ రిలీజ్‌కు రెడీ కాగా.. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 25 లేదా ఏప్రిల్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తొట్టెంపూడి వేణు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.
Tollywood Release Dates
కాగా శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇలా వరుస రిలీజ్ డేట్లు వచ్చి పడుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: విషాదం : తల్లిని కోల్పోయిన ఒకప్పటి అందాల తార !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Radheshyam ramarao kgf 2 release dates fix
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com