PRC: ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ వివాదం ఇంకా ముదురుతోంది. ఈ వివాదంలో తమదే పై చేయి అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఉద్యోగులు సైతం పట్టు వీడటం లేదు. తము న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ వేతనాల్లో కోత పెడుతున్నదని అంటున్నారు. పీఆర్సీపైన విడుదల చేసిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకొస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. చర్చలకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. మొత్తంగా ఇరు వర్గాలు గట్టిగానే తమ వాదనను వినిపిస్తున్నాయి.
తాము సమ్మె చేయబోతున్నామని ఉద్యోగులు చెప్తున్నప్పటికీ ఏపీ సర్కారు పంతం వీడటం లేదు. ఈ క్రమంలోనే ట్రెజరీ శాఖ చేత వేతనాల ప్రాసెస్ మొదలు పెట్టించింది. అలా ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతున్నది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఇరువురూ పట్టుదలకు పోతున్నారు. అలా సమ్మె సమయం కూడా దగ్గరకు వస్తున్నది. వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ఉద్యోగులు ప్రకటించారు. ఈ లోగా సమస్యకు పరిష్కారం వస్తుందని నమ్మకం అయితే కనబడం లేదు.
Also Read: మహేష్ సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు !
ఏపీ సర్కారు సైతం ఉద్యోగులు సమ్మె చేస్తే వారి స్థానంలో ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉద్యోగులు సమ్మెకు వెళ్లినట్లయితే వారికే నష్టం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నట్లు వినికిడి. ప్రభుత్వం ఇప్పట్లో ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం సమ్మెపైనే ఆశలు పెట్టుకున్నారు. తమ డిమాండ్లను గతంలో సమ్మెల ద్వారా సాధించుకున్నామని, ఈ సారి కూడా అలానే ఒత్తిడి తీసుకొచ్చి తమ డిమాండ్లను నెరవేర్చుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కరోనా తీవ్రత ఇతర కారణాల రిత్యా ఉద్యోగుల సమ్మెపైన జగన్ సర్కారు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఉద్యోగులపై ఎస్మా వంటి అస్త్రాలను ప్రయోగించి, చర్యలు మరింత కఠినతరం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఏపీ సర్కారుతో పాటు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి… ఏం జరుగుతుందో. అయితే, ఈ పీఆర్సీ వివాదంపైన ఇరు వర్గాలు సానుకూలంగా స్పందించి పరిష్కారం మధ్యే మార్గంలో చూసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.
Also Read: అవినీతి అంతంపై ప్రధానివి మాటలేనా.. చేతలు లేవా
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Prc dispute between government and employees in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com