Grand Mosque in Makkah: సౌదీ అరేబియా దేశంలోని ప్రఖ్యాత మక్కా మసీదును ముస్లింలు పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ స్థలాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకుంటారు. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి మక్కాను సందర్శించేందుకు తరలివస్తారు. అయితే మక్కా మసీదు ప్రాముఖ్యత పెరిగేకొద్దీ సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో వారికి అనుగుణంగా కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మక్కా గ్రౌండ్ లోకి ఒక్కసారిగా సందర్శకులు రావడంతో గాలి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఆ సమస్య తీర్చాలని ప్రభుత్వం తాజాగా ఓ ప్రణాళిక వేసింది.

ఒక్కోసారి సందర్శకుల తాకిడి విపరీతంగా పెరగడంతో మక్కా మసీదులో వేడి వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ మసీద్ ప్రజల ఇబ్బందులను తీర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ సహకారంతో మక్కా మసీద్ గ్రౌండ్ లో చల్లటి వాతావరణం నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద కూలింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రౌండ్లోకి చల్లటి గాలి వెళ్లేలా ప్లాన్ వేశారు. ఈ గాలి కూలింగ్ ఇవ్వడమే కాకుండా స్వచ్చమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
Also Read: Nagababu Assets: నాగబాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్.. టీవీ షోలతోనే సంపాదన పెరిగిందా?
ప్రస్తుతం మసీదులోకి చల్లటి గాలి అందించేందుకు రెండు పెద్ద ప్లాంట్లను ఏర్పాటు చేశామని మసీదు వ్యవహారాల డైరెక్టర్ మోహ్సేన్ ఆల్ సలామీ మీడియాకు తెలిపారు. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద కూలింగ్ ప్లాంట్ అని పేర్కొన్నారు. ఇవి ప్రతిరోజు 35,300 టన్నుల గాలిని ఉత్పత్తి చేయగా.. 24,500 టన్నులు ఉపయోగించబడుతుందన్నారు. 9 గంటల పాటు ఈ ప్లాంట్ ఏకధాటిగా పనిచేస్తుందని తెలిపారు. ఎలాంటి గాలినైనా ఈ ప్లాంట్ స్వీకరించి దానిని శుద్ధి చేసి గ్రౌండ్లోకి పంపిస్తుందన్నారు. కాలుష్య వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా కూలింగ్ ఏయిర్ సరఫరా చేస్తుందన్నారు.

అత్యాధునిక ఇంజనీర్ల సహాయంతో దీనిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే ఈ ప్లాంట్ ద్వారా కేవలం కూలింగ్ మాత్రమే కాకుండా ఉష్ణోగ్రతను సమపాళ్లలో ఉంచుతుందన్నారు. ఈ ఏయిర్ వల్ల సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం సెంట్రల్ లో ఈ కూలింగ్ వ్యవస్థ పనిచేస్తోందని, కాలానుగుణంగా అవసరమైన చోట్ల దీనిని విస్తరిస్తామని తెలిపారు.
Also Read:Chiranjeevi: షాకింగ్.. షూటింగ్ లో ఉన్న రెండు సినిమాలను ఆపేసిన చిరంజీవి
[…] Also Read: Grand Mosque in Makkah: మక్కామసీదులో అద్భుతం.. ప్రపం… […]
[…] Also Read: Grand Mosque in Makkah: మక్కామసీదులో అద్భుతం.. ప్రపం… […]