Homeఎంటర్టైన్మెంట్Nagababu Assets: నాగబాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్.. టీవీ షోలతోనే సంపాదన పెరిగిందా?

Nagababu Assets: నాగబాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్.. టీవీ షోలతోనే సంపాదన పెరిగిందా?

Nagababu Assets: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు చెబుతారు. ఇది అక్షరాల సరిపోతుంది మెగా బ్రదర్ నాగబాబుకు. నటుడిగా, నిర్మాతగా, టీవీ షోలకు జడ్జిగా పలు అవతారాలు ఎత్తిన నాగబాబు ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిగానే కొనసాగుతున్నారు. మొదట రాక్షసుడు సినిమాలో చిరంజీవితో కలిసి తెరంగేట్రం చేసిన నాగబాబు తరువాత హీరోగా మారారు. అది కలిసి రాకపోవడంతో నిర్మాతగా మారి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, ఆరెంజ్ సినిమాలు తీశారు. ఇందులో రుద్రవీణ కమర్షియల్ గా హిట్ కాకున్నా మంచి టాక్ మాత్రం వచ్చింది. తరువాత బావగారు బాగున్నారా ఫర్వాలేదనిపించింది. కానీ నిర్మాతకు నాగబాబుకు మిగిలింది శూన్యమే.

Nagababu Assets
Nagababu

తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి మెప్పించారు. పిదప జబర్దస్త్ షోకు జడ్జిగా చాలా కాలం పాటు వ్యవహరించారు. జడ్జిగానే ఎక్కువ మొత్తంలో సంపాదన చేశారు. దీంతో ఇప్పుడు మెగా బ్రదర్స్ కు ఏ మాత్రం తీసిపోని సంపాదన నాగబాబు సొంతం అయింది. ఆయన ఆస్తులు మొత్తం కలిపి రూ.41 కోట్లు ఉన్నట్లు ఆ మధ్య నరసాపురం ఎంపీకి పోటీ చేసిన సందర్భంలో అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో నాగబాబు ఆస్తుల విలువ అంత పెద్ద మొత్తంలో ఉండటంతో అందరు ఆశ్చర్యపోయారు. కానీ ఆయనకు టీవీషోలే ఎక్కువగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: మహేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ప్రాంతం లో మేజర్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం

గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నాగబాబు కీలకంగా వ్యవహరించారు. దీంతో తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి కూడా పెద్దదిక్కుగా మారి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ రఘురామ కృష్ణం రాజు గెలిచారు. ప్రస్తుతం కూడా జనసేనలో కీ రోల్ పోషించేందుకు నాగబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగబాబు జనసేనలో అన్ని తానై చూసుకుని తమ్ముడు పవన్ కల్యాణ్ కు అండగా నిలిచేందుకే సిద్ధమైనట్లు సమాచారం.

Nagababu Assets
Nagababu

ఇంట్లోనే ఇద్దరు మెగా హీరోలున్నా నాగబాబుకు మాత్రం కలిసి రాలేదు. దీంతో ఆయన నిర్మాతగా తప్పుకున్నారు. సినిమాలు నిర్మించే పనికి దూరంగా ఉన్నారు. టీవీ షోలతోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అందుకే ఆయన ఆస్తుల విలువ అంతలా పెరిగిపోయింది. నిర్మాతగా నష్టపోవడంతో ఒక దశలో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధపడిన నాగబాబు ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నారు. పవన్ కల్యాణ్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

Also Read:AP 10th class Results : 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే!.. ఇది మన ఏపీ ప్రభుత్వ పాఠశాలల షాకింగ్ ఫలితాలు..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version