Kakinada Tiger: ఆ పులి మహా ముదురు…చిక్కినట్టే చిక్కి రెస్క్యూటీమ్ కు చుక్కలు

Kakinada Tiger: ఆ పులి మహా ముదురు. చిక్కినట్టేచిక్కి తప్పించుకుంటోంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో గత 15 రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అటవీ అధికారులకు, రెస్క్యూటీమ్ కు చుక్కలు చూపిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం పొలిమేరల్లో మకాం వేసి పశువులను చంపుకొని తింటున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీఅధికారులు, రె స్క్యూ బృందాలు అష్టదిగ్భంధం చేసినా అది చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతోంది. శనివారం రాత్రి లేగదూడ, ఆవు చంపిన ప్రదేశాల్లో పెద్దపులికోసం మూడు బోన్‌లు ఏర్పాటు చేసి […]

Written By: Dharma, Updated On : June 7, 2022 10:23 am
Follow us on

Kakinada Tiger: ఆ పులి మహా ముదురు. చిక్కినట్టేచిక్కి తప్పించుకుంటోంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో గత 15 రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అటవీ అధికారులకు, రెస్క్యూటీమ్ కు చుక్కలు చూపిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం పొలిమేరల్లో మకాం వేసి పశువులను చంపుకొని తింటున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీఅధికారులు, రె స్క్యూ బృందాలు అష్టదిగ్భంధం చేసినా అది చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతోంది. శనివారం రాత్రి లేగదూడ, ఆవు చంపిన ప్రదేశాల్లో పెద్దపులికోసం మూడు బోన్‌లు ఏర్పాటు చేసి ఆవు మాంసం, లేగదూడ, గొర్రె ను ఎరగా పెట్టారు. అర్ధరాత్రి దాటాక ఆకలితో అటవీ అధికారులు ఏర్పా టు చేసిన బోన్‌ వద్దకు పెద్దపులి వచ్చింది. బోన్‌ చుట్టూ తిరిగి లోపల ఉన్న లేగదూడ, మాంసం, గొర్రె జోలికి పోకుండా వెనక్కి వచ్చేసిన దృ శ్యాలు ఆదివారం సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో పులి ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా అటవీ, రెస్క్యూ బృందాల ఎర ఏర్పాట్లకు చిక్కకుండా తప్పించుకుంది. దీంతో పులి బోన్‌ వద్దకు వచ్చి చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పులి చాలా తెలివితేటలుగా వ్య వహరిస్తోందని ప్రజలు, రెస్క్యూ బృందాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ పులిని పట్టుకోవడం రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది.

Kakinada Tiger

కంటిమీద కునుకు లేకుండా..
పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టుకునేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం పొలిమేరల్లోని పొలాల్లో ఇప్పటికే ఎరతో కూడిన మూడు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఆకలితో ఉన్న పులి ఎక్కడో ఒకచోట తప్పకుండా పడుతుందని ఆత్మకూరునుంచి మరో రెండు బోన్‌లను రప్పించారు. ఈ ఐదు బోనుల్లో లేగదూడ, గొర్రె, మేకలను గతంలో పులి చంపిన ఆవు మాంసాన్ని ఎరగా పెట్టారు. బోన్లను పెద్దపులి అనుమానించికుండా వా టిపై పచ్చిరొట్ట వేశారు. గత 24గంటల వ్యవధిలో పులి పశువులపై దాడి చేయకపోవడంతో తీవ్ర ఆకలిపై ఉంటుందని అటవీశాఖాధికారులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి కచ్చితంగా ఎరపెట్టిన బోనుల వద్దకు వ చ్చి చిక్కుతుందనే ఆశాభావాన్ని అటవీశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Grand Mosque in Makkah: మక్కామసీదులో అద్భుతం.. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద కూలింగ్ సిస్టం

Kakinada Tiger

మత్తు ప్రయోగానికి సిద్ధం..
రెస్క్యూ బృందాలు ఏర్పాటు చేసిన బోన్‌లకు పెద్దపులి చిక్కకపోతే మత్తు ప్రయోగానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే 12కు పైగా పశువులను చంపితిన్న పెద్దపులి వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకుని మత్తు ప్రయోగానికి జాతీయ పులుల సంరక్షణా అథారిటీ అనుమతులు కూడా రెస్క్యూ బృందాలు తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి నుం చి నైట్‌ విజన్‌ పరికరాల ద్వారా పులి ఆచూకీని కనుగొనేందుకు వారు తీ వ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులికి సమాంతరంగా నడిస్తే మత్తు ఇంజక్షన్‌ తుపాకీ ద్వారా ఇచ్చేందుకు గన్‌షూటర్లు కూడా పహారా కాస్తున్నారు. ఆ ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం గ్రామాల పొలిమేరలు పులి పశువుల వేటకు చాలా అనువుగా మారడంతో ఈ ప్రదేశం నుంచి పులి కదలడం లేదు. ఈ మూడు గ్రామాల పొలిమేరల మధ్యలో ఉన్న సురవరపు మెట్టను ఆశ్రయంగా చేసుకుని పులి పశువులపై యథేచ్ఛగా దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ ప్రదేశంలో దట్టమైన సరుగుడు తోటలు, యూకలిప్టస్‌ తోటలు, మామిడి, జీడిమామిడి తోటలు అధికంగా ఉండడంవల్ల పులి సంచారానికి రక్షణతో కూడిన శత్రు దుర్భేద్యంతో పచ్చదనం నిండి ఉండడంతో పులి ఇక్కడ నుంచి కదలడం లేదు. అందుబాటులో దాహం తీర్చుకునేందుకు ఏలేరు ఎడమ కాలువ, శరభవరం, పొదురుపాకల మధ్య గడ్డ కాలువ, పొదురుపాక చెరువు వంటి నీటి వనరులు ఉండడంతో పులికి ఈ ప్రదేశం ఎంతో సౌకర్యవంతంగా మారినట్లు తెలుస్తోంది. అందుబాటులో వేటాడేందుకు పశువులు, తాగునీరు, ప్రకృతి సౌందర్యం కలిసి రావడం వల్ల పులి వచ్చి 15 రోజులు గడిచినా ఆ ప్రాంతం వదిలి వెళ్లడం లేదు. దీంతో పులిని చాలా వ్యూహాత్మకంగా బోన్‌లు, మత్తు ఇంజక్షన్‌లతోనే బంధించాలని అటవీశాఖాధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

Also Read:Mahesh Babu: మహేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ప్రాంతం లో మేజర్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం

Tags