Assembly Elections 2023 : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. 5 రాష్ట్రాల్లో మిజోరం ఫలితం ఎలా వచ్చినా అది దేశం మొత్తం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. మిజోరంలో కేవలం ఒకటి రెండు ఎంపీ సీట్లే కాబట్టి అది పక్కనపెడితే నాలుగు కీలకమైన రాష్ట్రాల్లో గెలుపు ప్రభావం చూపనుంది. ఈ నాలుగింట్లో 3 హిందీ ప్రాంత రాష్ట్రం. ఒక్కటి దక్షిణాది రాష్ట్రం.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రెండూ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగ నిలిచింది. తెలంగాణలో బీఆర్ఎస్ లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా బీజేపీ ఒక్క రాష్ట్ర కూడా గెలవలేదు.
తర్వాత 4 నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 3 ఉత్తరాధి రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే తెలంగాణలో 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలవడం విశేషం. అసెంబ్లీకి, లోక్ సభకు జనం చాలా వ్యత్యాసం చూపిస్తున్నారని అర్థమవుతోంది. 2018లో ఓటర్లు అసెంబ్లీకి ఒక పద్ధతిలో.. లోక్ సభకు మోడీని నమ్మి ఓటు వేస్తున్నారు.
కాంగ్రెస్ కనుక 3 హిందీ రాష్ట్రాలు, ఒక తెలంగాణ దక్షిణాది రాష్ట్రం గెలిస్తే బెటర్ ఇమేజ్ వస్తుంది. ఇండియా కూటమిలో నాయకత్వ స్థానం దక్కించుకుంటుంది. లోక్ సభకు బలమైన పోటీదారుగా కాంగ్రెస్ నిలుస్తుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా బీజేపీకే బెటర్ ఛాన్స్ ఉంటుంది. దానికి కారణం మోడీ పాపులారిటీనే కారణం..
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితం లోక్ సభ ఎన్నికలపై ఏ మేరకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.