Karthika Nair: కాబోయే భర్త ఫోటోలు షేర్ చేసిన కార్తీక్ నాయర్

సడన్ గా కార్తీక పెళ్లి అనే వార్త వైరల్ అవడంతో.. ఈ వార్త నిజమేనా? తనకు కాబోయే భర్త ఎవరు? అనే ప్రశ్నలు ఆమె అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే కార్తీక నటి రాధ కూతురిగా అందరికీ తెలిసిందే.

Written By: Suresh, Updated On : November 18, 2023 3:50 pm

Karthika Nair

Follow us on

Karthika Nair: కార్తీక గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన సినిమాలు కొన్ని అయినా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ అనుకున్న రేంజ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు ఈ అమ్మడుకు. అయితే నటి కార్తీక 2009లో వచ్చిన జోష్ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది అమ్మడు. అయితే ఈ నటి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

సడన్ గా కార్తీక పెళ్లి అనే వార్త వైరల్ అవడంతో.. ఈ వార్త నిజమేనా? తనకు కాబోయే భర్త ఎవరు? అనే ప్రశ్నలు ఆమె అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే కార్తీక నటి రాధ కూతురిగా అందరికీ తెలిసిందే. తనదైన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. జోష్ సినిమా తర్వాత జీవ, పియా బాజ్ పాయ్ కీ రోల్ లో నటించిన కో సినిమాకు వచ్చిన పాపులారిటీతో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది కార్తీక. తెలుగులో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి సినిమాలతో అలరించింది.

నటి కార్తీక ఇటీవలే రోహిత్ మీనన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫోటోలను కార్తీక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. డిసెంబర్ నెలలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన మరిన్ని వార్తలు తెలియాల్సి ఉంది. ఇక కార్తీక నాయర్ చివరిసారిగా 2015లో ఆర్యతో కలిసి పురం పోక్కు ఎంగిర పొదువుడమై లో కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ నటి. రీసెంట్ గా తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ మిమ్మల్ని కలవడం విధి రాత.. మీ ప్రేమలో పడిపోవడం మాయాజాలం కలిసి జీవించడానికి కౌంట్ డౌన్ మొదలైంది అనే శీర్షికను యాడ్ చేసింది కార్తీక.

కార్తీక నాయర్ నటి రాధ, రాజశేఖరన్ దంపతుల కూతురు అని తెలిసిందే. సినిమాలతో పాటు 2017లో ఆరంభ్ అనే టెలివిజన్ సీరియల్ లో దేవసేన పాత్రలో మెరిసారు కార్తీక. మొత్తం మీద ఈ అమ్మడు త్వరలోనే ఓ ఇంటి కోడలు కానుంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.