TDP : తెలుగుదేశం NDA కూటమిలో చేరుతుందా? లేదా?

జగన్ కంటే చంద్రబాబు బెటర్ అన్న క్లియర్ కట్ మెసేజ్ ను పవన్ ఇచ్చారు. బీజేపీని వదిలి పవన్ పోటీచేయరని తేలిపోయింది. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా? అన్నది సమాలోచనలు చేస్తామన్నారు.

Written By: NARESH, Updated On : August 19, 2023 6:42 pm

TDP : ఆంధ్రాలో పొత్తుల పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఊహాగానాలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ మాటల ప్రకారం.. జనసేన+బీజేపీ కూటమిలో తెలుగుదేశాన్ని కలుపుకోవాలన్న ఆశను వెలిబుచ్చారు. ఎన్టీఏలో కొత్త వారు చేరే అవకాశంపై త్వరలో నిర్ణయం జరుగుతుందన్నారు.

జగన్ కంటే చంద్రబాబు బెటర్ అన్న క్లియర్ కట్ మెసేజ్ ను పవన్ ఇచ్చారు. బీజేపీని వదిలి పవన్ పోటీచేయరని తేలిపోయింది. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా? అన్నది సమాలోచనలు చేస్తామన్నారు. చర్చలు నడుస్తున్నాయని.. పొత్తులు ఎలా ఉంటాయో చూద్దాం అని అన్నారు.

పవన్ కళ్యాణ్ పొత్తులపై తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టిడిపిలో టెన్షన్ పెంచుతున్నాయి. బిజెపితో పొత్తు, ఎన్డీఏ భాగస్వామి పక్షాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో పవన్ వారాహి యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. తాజాగా పొత్తులపై పవన్ చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి.

ఇప్పటివరకు పవన్ అటు బీజేపీ, ఇటు టిడిపి తో కలిసి నడవాలని భావించారు. అప్పుడే అధికార వైసీపీని ఓడించగలమని చెబుతూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనని తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాల రూపొందించుకుంటూ వచ్చారు. అటు కేంద్ర పెద్దలతో పాటు ఇటు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే వెళ్తాయని సంకేతాలు ఇచ్చారు.అయితే తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఆలోచింపజేస్తున్నాయి.

తెలుగుదేశం NDA కూటమిలో చేరుతుందా? లేదా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.