Gadar 2 Collections: హీరో సన్నీ డియోల్ ఒక దశలో బాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్నారు. ఆయన ఫేమ్ తగ్గుతూ వచ్చింది. న్యూ జనరేషన్ స్టార్స్ గా ఎదిగాక ఆయన మేనియా పడిపోయింది. ఇలాంటి సమయంలో తన కెరీర్లో మైలురాయిగా ఉన్న గదర్ చిత్రానికి సీక్వెల్ తీసి విజయం సాధించాడు. 2001లో వచ్చిన గదర్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. యావత్ భారతదేశం గదర్ చిత్రానికి దాసోహం అంది. దేశభక్తికి ప్రేమకథను మేళవించి చేసిన గదర్ బాలీవుడ్ ని ఊపేసింది. సన్నీ డియోల్ కి జంటగా అమీషా పటేల్ నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించారు.
ఇదే కాంబినేషన్ దాదాపు 22 ఏళ్ళ తర్వాత రిపీట్ చేశారు. గదర్ 2 సైతం పార్ట్ 1 తరహాలో ఆదరణ దక్కించుకుంటుంది. గద్దర్ 2 పై విడుదలకు ముందు నుండే హైప్ ఉంది. ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అది ఓపెనింగ్స్ లో కనిపించింది. గదర్ 2, ఓ మై గాడ్ 2 ఒకే రోజు విడుదలయ్యాయి. గదర్ 2 బుకింగ్స్ ఓ మై గాడ్ 2 కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఫస్ట్ షో నుండే గదర్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సాలిడ్ వసూళ్లు దక్కాయి. పఠాన్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులు గదర్ 2 చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఫస్ట్ వీక్ ముగిసేనాటికి గదర్ 2 రూ. 284.6 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక సెకండ్ వీక్ ఫస్ట్ డే శుక్రవారం రూ. 19.50 కోట్లు రాబట్టింది. దాంతో 8 రోజులకు గదర్ 2 రూ. 304 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది పఠాన్ అనంతరం మూడు వందల క్లబ్ లో చేరిన హిందీ చిత్రంగా గదర్ 2 రికార్డులకు ఎక్కింది.
ఈ చిత్ర విడుదల రోజు సన్నీ డియోల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారట. మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తన ఆనందానికి హద్దులు లేవట. ఆ రోజు రాత్రి అంతా నవ్వుతూ ఏడుస్తూ ఉండిపోయాడట. వాళ్ళ నాన్న ధర్మేంద్ర తనకు ఏమైంది అన్నట్లు చూశాడట. నేను ఆల్కహాల్ తాగలేదు. కేవలం సంతోషంగా ఉన్నాను. అందుకే ఇలా చేస్తున్నానని చెప్పారట. గదర్ 2 విజయం పై సన్నీ డియోల్ ఎంతటి హోప్స్ పెట్టుకున్నారో చెప్పేందుకు ఇది నిదర్శనం.