Swastika Symbol: దేవాలయాలకు వెళ్లినప్పుడు దైవాన్ని కొలస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. అయితే అంతకంటే ముందు తల వెంట్రుకలను సమర్పిస్తాం. తిరుపతికి వెళ్లినప్పుడు తల వెంట్రుకలు ఇవ్వకుండా మాత్రం వెనక్కి రారు. అయితే కొంత మంది చిన్నపిల్లలకు పుట్టువెంట్రుకలను ముందుగా దైవసన్నిధిలోనే తీస్తారు. పుట్టినప్పుడు వచ్చే వెంట్రుకలు దైవంతో సమానం అని భావించి ఇలా చేస్తారు.
పుట్టు వెంట్రుకలు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తూ ఉంటారు. పాప, బాబు పుట్టు వెంట్రుకలను తన మేనమామ లేదా తాతయ్య ద్వారా తీసి వాటిని ఇలవేల్పుకు సమర్పిస్తారు. అయితే పుట్టు వెంట్రుకలు తీసిన తరువాత గుండుకు కొందరు గంధంతో స్వస్తిక్ గుర్తును రాస్తారు. ఇలా రాయడానికి కారణం ఏంటి?
మనం చేసే ప్రతీ మొదటి కార్యక్రమాన్ని దైవ సన్నిధిలో నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మనం చేసే ప్రతీ పూజకు ముందు వినాయకుడి ఆరాధిస్తాం. గణనాథునికి పూజా విధానాలు చేసిన తరువాతే మిగతా దేవుళ్లను ఆరాధిస్తాం. అలా పాప లేదా బాబుకు పట్టు వెంట్రుకలు మొదటిసారి తీస్తున్నందున ఆ వెంట్రుకలు తమ ఇష్టదైవానికి సమర్పించి ఆ చిన్నారి తలపై గంధంతో స్వస్తిక్ నామం రాస్తారు. అయితే గంధం పెట్టడం వల్ల తలకు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే చిన్న పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల గంధాన్ని గుండుకు రాస్తారు.
స్వస్తిక్ గుర్తు ఎందుకు రాస్తారంటే.. చిన్నారి భవిష్యత్ బాగుండాలని గుర్తుగా ఇలా చేస్తారు. ఇలా రాయడం వల్ల తన జీవితంలో దైవం తోడుండాలని కోరుకుంటారు. ఇలా స్వస్తిక్ గీసిన ఆరు నెలల తరువాత శిశువునకు అన్నప్రసాన చేస్తారు. ఆ తరువాత సరిగ్గా ఏడాదికి శిశువుకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. పుట్టు వెంట్రుకలే కాకుండా ప్రతీ శుభకార్యంలోనూ మొదటగా స్వస్తిక్ గుర్తు రాస్తారు. మనం ఎక్కువగా గృహ ప్రవేశాల్లోనూ, షాపు ప్రారంభంలోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.