YS Sharmila: వైఎస్.షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరిగా అందరికీ తెలిసిందే. తండ్రి మరణం తర్వాత అన్న జగన్ కాంగ్రెస్‌పై సాగించిన యుద్ధంలో షర్మిల కూడా కీలకపాత్ర పోషించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని ప్రజల్లోలకి తీసుకువచ్చారు. 2019లో బైబై బాబు అనే స్లోగన్‌తో టీడీపీ ఓటమిలోనూ కీలకంగా వ్యవహరించారు. కానీ, మారిణ పరిణామాలు, కుటుంబంలో వచ్చిన విభేదాలతో ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చారు. మూడేళ్ల క్రితం రాజకీయ పార్టీ స్థాపించారు. పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ, గతంలోలా ఆదరణ రాలేదు. షర్మిలను తెలంగాణ సమాజం ఆంధ్రా మహిళగానే చూసింది. దీంతో 2023 ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌తో రాయబారం నడిపి విజయవంతమయ్యారు.
చేరికే మిగిలింది..
కాంగ్రెస్‌లో చేరిన చేరిక దాదాపు ఖాయమైంది. ఈ మేరకు కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ పార్టీ నుంచి ఇప్పటికే ప్రకటనలు కూడా వెలుపడ్డాయి. షర్మిల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరి ఎందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చేసిన రాయబారం ఫలించింది. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఇంకా పార్టీలో అధికారికంగా చేరడం మాత్రమే మిగిలింది.
ఎక్కడి నుంచి రాజకీయాల్లోకి..
షర్మిల కాంగ్రెస్ చేయడం ఎవరు వ్యతిరేకించడం లేదు. తెలంగాణలో రాజకీయం చేయడం మాత్రం ఇక్కడ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కారణంగా తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో షర్మిలతో ప్రచారం చేస్తే లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుందని అదృష్టానికి తెలిపింది. దీంతో షర్మిలను ఆంధ్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొనాలని సూచించింది.
తెలంగాణలోనే ఉంటానని..
తాను తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే యాక్టివ్ గా ఉంటానని ఆంధ్రకు వెళ్లని షర్మిల కాంగ్రెస్ అదృష్టానికి తెలిపారు. తెలంగాణకే అంకితం కావాలని నేర్చుకున్నట్లు వెల్లడించారు. నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వైయస్ఆర్ తనయ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆమెన్ చేరికను ఇక లాంఛనం చేయనుంది.
ఖమ్మం లేదా కర్ణాటక..
షర్మినాకు రాబోయే లోకసభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖమ్మంలో ఆంధ్రప్రభ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తే శరణు గెలిచే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది. అయితే ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఎంపీ టికెట్ కుదరకుంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మొత్తంగా షర్మిల చేరిక కాంగ్రెస్‌తో దాదాపు ఖరారు కానుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will sharmilas dream come true will congress join
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com