KTR(1)
Hyderabad Formula E Race Case: తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ – కార్ రేసు కేసు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన వారం వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేసు నమోదుకు ఆదేశించారు. ఈమేరకు రంగంలోకి దిగిన ఏసీబీన గురువారం(డిసెంబర్ 19న) కేటీఆర్‌తోపాటు, అరవింద్‌కుమార్, నర్సింహారెడ్డిని వరుసగా ఏ1, ఏ2, ఏ3గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన కొన్ని గంటలకే కేటీఆర్ న్యాయస్థానం తలుపు తట్టారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనపై పెట్టిన సెక్షన్లు వర్తించవని, ఎఫ్‌ఐఆర్ క్యాష్ చేయాలని కోరారు. అయితే పటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఏసీబీ మాత్రం అక్రమంగా నగదు బదిలీ చేశారని, ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సిందని నమోదు చేసింది.
రంగంలోకి ఈడీ..
రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసు కేసుపై ఏసీబీ విచారణ మొదలు కూడా కాకముందే.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఎంటర్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు కేటీఆర్ పిటిషన్ శుక్రవారం(డిసెంబర్ 20న) విచారణకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లంచ్‌మోషన్ పటిషనే అయినా.. విచారణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ కావడం, ఎఫ్‌ఐఆర్‌తోపాటు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏఈసబీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కే టీఆర్‌పై రెండు సంస్థలు దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేసీఆర్ కుటుంబానికి ఈడీ భయం..
కేసీఆర్ కుటుంబానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే వణుకే. ఎందుకంటే.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఈడీ రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పేరు రావడంతో తన కూతురును కాపాడుకునేందుకు రహస్యంగా జీవో జారీ చేశారు. కానీ, ఈడీ ఢిల్లీలో నమోదైన కేసు విషయంలో నేరుగా కవిత ఇంటికి వచ్చింది. అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు ఎలాంటి నిషేధం లేదు. దీంతో కేటీఈఆర్ విషయంలో అవి దూకుడు ప్రదర్శిస్తే అరెస్టు తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కోర్టు తీర్పే కీలకం..
ఇదిలా ఉంటే.. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది. కోర్టు ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇస్తే విచారణ ఆగిపోతుంది. దర్యాప్తునకు అనుమతి ఇస్తే.. మాత్రం ఇటు ఏసీబీ, అటు ఈడీ రెండూ దూకుడు పెంచే అవకాశం ఉంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hyderabad formula e race case acb registers case on formula e car race ktr as a1
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com