Will JanaSena Alliance With TDP For 2024 Elections : జనసేన , తెలుగుదేశం కలిసి పనిచేస్తాయా? చేయాలా? అన్నది ప్రజల్లో జరుగుతున్న హాట్ టాపిక్ చర్చ. దీనికి కారణం ఏంటంటే.. జగన్ ను ఏ ఒక్క పార్టీ కూడా ఓడించలేదనే కన్ క్లూజన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ పరిస్థితులు ఇంకా రెండేళ్లు ఉంటాయా? అంటే చెప్పలేం.

సీఎం జగన్ రోజురోజుకు బలహీనపడుతున్నాడని ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది. రాజధాని వివాదం.. వైఎస్ వివేకా హత్య , భీమ్లానాయక్, సినిమా టికెట్ల వివాదం.. ఇలా మెల్లిమెల్లిగా ఈ విషయాల్లో ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. వెరసి వివాదాల జగన్ గా మారిపోయారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి నిజంగానే నచ్చిందా ? లేక కాంప్రమైజ్ అయ్యాడా ?
కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులు 2024కు ఉంటాయని చెప్పలేం. అలాగని పొత్తుల ఆలోచన ఇవ్వాళ సమయం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. జనసేనతో పొత్తుకు టీడీపీ వర్గాల నుంచి ఎక్కువగా వస్తోంది. 2024కు పవన్ కళ్యాణ్ పార్టీ బలపడితే సగం సీట్లు వెళ్లిపోతాయి. అందుకే బలపడకముందే ఇప్పుడే పొత్తు పెట్టుకుంటే టీడీపీనే పెద్దపార్టీగా ఎక్కువ సంఖ్యలో పోటీచేయవచ్చు. రేపు సీఎం సీటును లాక్కోవచ్చు. అందుకోసమే ఇప్పటి నుంచే పొత్తు ప్రతిపాదనను టీడీపీ లు చేస్తున్నాయని టాక్ నడుస్తోంది.
Also Read: Cinema Ticket Rates : సినిమా టికెట్ల జీవో జారీ.. మళ్ళీ దెబ్బేసిన జగన్ !
చంద్రబాబు ఆ దిశగా మేధావులను ప్రోత్సహించి ఈ చర్చకు మీడియాను ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జనసేనకు ఇది నష్టం తప్పితే లాభం కాదు. ముందుగా జనసేన ఏపీలో బలపడితే ఆటోమేటిక్ గా ఆ పార్టీకి మంచి అవకాశాలుంటాయి.. జనసేన తెలుగుదేశం కలిసి పోటీచేస్తే లాభమా? నష్టమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] […]
[…] Junior Ntr Political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ తరఫున కాబోయే సీఎం ఎన్టీఆరే అని.. ఇలా తారక్ అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోతుండటం, దీనికితోడు తారక్ లో మంచి రాజకీయ నాయకుడు ఉండటం.. మొత్తానికి కొందరు టీడీపీ నాయకులకు ఇది నినాదం అయ్యింది. […]
[…] Also Read: జనసేన-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయా?… […]