Congress : దక్షిణాది పార్టీగా మాత్రమే కాంగ్రెస్ మిగలబోతుందా?

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? దేశంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే లేనే లేదని చెప్పొచ్చు. కేవలం దక్షిణ భారత్ లో మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణాది పార్టీగా కాంగ్రెస్ మిగలబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 2, 2023 5:46 pm

Congress : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మై యాక్సిస్ ఇండియా పోల్స్ విడుదల చేసింది. అత్యంత విశ్వసనీయ సంస్థ ఇదీ.. ఫలితాల సరళి చూస్తే.. మధ్యప్రదేశ్ లో బీజేపీ గాలి వీస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ లో ఎవరైనా బోటాబోటీ మెజార్టీతోనే గెలవబోతున్నారు. మిజోరం పెద్ద లెక్కలోకి రాదు.

ఈ సర్వే నిజమైతే.. దక్షిణాదిన చూస్తే.. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటాయి. తమిళనాడులో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటాయి. కేరళలో సీపీఎం+కాంగ్రెస్ లాలూచీ కుస్తీ ఉంటుంది. ఆంధ్రలో కాంగ్రెస్ ఆనవాళ్లు ఉంాయి.

తెలంగాాణలో కాంగ్రెస్ గెలిచినా.. పక్కనే ఉన్న ఆంధ్రాలో జాకీలు వేసి లేపినా లేవదు. ఇదీ దక్షిణాదిన పరిస్థితి. దేశంలో బెంగాల్, ఒడిషాలో కాంగ్రెస్ పోటీలో లేదు. ఉత్తర భారత్ లో యూపీ, బీహార్ లో కాంగ్రెస్ పోటీలో లేదు. పంజాబ్ లో ఈసారి ఒకటో రెండో సీట్లకే పరిమితం కానుంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరం.. ఈ సర్వే ప్రకారం ఈ మూడు రాష్ట్రాలు గెలవడం అటుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలవడం అతి కష్టమే..