Sreeleela: పర్పుల్ కలర్ డ్రెస్ లో హీరోయిన్ శ్రీలీల అందాల మెరుపులు… మైండ్ బ్లాక్ చేసే గ్లామరస్ లుక్ వైరల్

ధమాకా సూపర్ హిట్ కావడంతో శ్రీలీలకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. శ్రీలీల నటించిన ఒక్కో చిత్రం విడుదలవుతుంది. ఈ ఏడాది ఆమెకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. స్కంద మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది.

Written By: NARESH, Updated On : December 2, 2023 3:56 pm

Sreeleela

Follow us on

Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. అరడజనుకు పైగా సినిమాలకు సైన్ చేసి సంచలనానికి తెరలేపింది. పెళ్లి సందడి 2021 మూవీతో శ్రీలీల టాలీవుడ్ లో అడుగుపెట్టింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే శ్రీలీల గ్లామర్, డాన్సులు ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే రవితేజకు జంటగా ధమాకా మూవీలో ఆఫర్ పట్టేసింది. రవితేజ ఎనర్జీకి పోటీ ఇస్తూ శ్రీలీల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది.

ధమాకా సూపర్ హిట్ కావడంతో శ్రీలీలకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. శ్రీలీల నటించిన ఒక్కో చిత్రం విడుదలవుతుంది. ఈ ఏడాది ఆమెకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. స్కంద మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది. బోయపాటి ఊరమాస్ తట్టుకోలేక జనాలు థియేటర్స్ నుండి పారిపోయారు.

అయితే భగవంత్ కేసరితో హిట్ కొట్టింది. భగవంత్ కేసరి చిత్రానికి దసరా సెలవులు కలిసొచ్చాయి. అలాగే పోటీగా విడుదలైన లియో, టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ అంశాలు సహకరించడంతో భగవంత్ కేసరి స్వల్ప లాభాలతో హిట్ స్టేటస్ అందుకుంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేసింది. చెప్పాలంటే కూతురు కాని కూతురుగా కనిపించింది.

భగవంత్ కేసరి విజయాన్ని ఆస్వాదించే లోపే మరో ప్లాప్ పడింది. ఆదికేశవ డిజాస్టర్ కాగా… వచ్చి వెళ్లిన విషయం కూడా జనాలకు తెలియలేదు. శ్రీలీలకు వెంటనే ఓ భారీ కమర్షియల్ హిట్ కావాలి. గుంటూరు కారం మూవీతో ఆ కోరిక తీరుతుందని భావిస్తుంది. శ్రీలీల ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం, ఈ చిత్ర విజయంపై ఆమె ఆశలు పెట్టుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. శ్రీలీల లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.