Homeఎంటర్టైన్మెంట్Couple Friendly two weeks Collections: కోటి రూపాయిల బడ్జెట్ తో 'కపుల్ ఫ్రెండ్లీ '...

Couple Friendly two weeks Collections: కోటి రూపాయిల బడ్జెట్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ ‘ తీశారు..కానీ 2 వారాల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా!

Couple Friendly two weeks Collections: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా విజయవంతంగా రెండు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ రన్ కి ప్రభాస్ తో మూవీ టీం చేసిన ఇంటర్వ్యూ చాలా కలిసొచ్చింది. రెండవ వీకెండ్ లో భారీ వసూళ్లను నమోదు చేసింది ఈ చిత్రం. కోటి రూపాయిల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం , 6.5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. మరి ఈ రెండు వారాల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , ఆంధ్రా + సీడెడ్ నుండి 2.65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఎందుకో ఓవర్సీస్ నుండి మాత్రం చాలా తక్కువ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలు మన దగ్గర కంటే ఓవర్సీస్ లోనే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. అలాంటిది ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ నుండి భారీ వసూళ్లు నమోదు కాకపోవడం అనేది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 1.03 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

Also Read: విరాట్ కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన రష్మిక.. ఇదేమి క్రేజ్ బాబోయ్!

ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6.02 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 12.70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి . బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఈ చిత్రం మరో 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ సినిమాకు గత రెండు రోజులకు కలిపి 20 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ కచ్చితంగా భారీ గ్రోత్ ని చూపించాలి. లేదంటే స్వల్ప నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version