Restaurant: పొరుగింటి కూర తియ్యన అని చాలా మంది అభిప్రాయం. అందుకే ఇంట్లో రోజూ వండే వంట కాకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్ కు వెళ్లి వెరైటీ వంటకాలు తినాలని చాలా మందికి ఉంటుంది. అందుకే ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ లో కలిసి రెస్టారెంట్ లోకి వెళ్లి రుచికరమైన ఆహారాన్ని లాగించేస్తారు. చాలా సందర్భాల్లో పార్టీలు ఇవ్వడానికి కూడా దీనినే ఎంచుకుంటారు. అయితే రెస్టారెంట్ లో టెస్టీ ఫుడ్ లభించినా దానికి వేసే బిల్లులో కొందరు చాలా మోసాలు చేస్తుంటారు. ముఖ్యంగా జీఎస్టీని విధించడంలో కొందరు అతి తెలివిని ప్రదర్శిస్తారు. దీంతో చాలా మంది వినియోగదారులు తమకు తెలియకుండానే చాలా నష్టపోతున్నారు. ఇంతకీ రెస్టారెంట్ బిల్లుల్లో ఎలాంటి మోసం ఉంటుందంటే?
స్నేహితులతో సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఆనందంలో బిల్లు ఎంతయినా పర్వాలేదు కట్టేస్తాం అనే మూడ్ లో ఉంటారు. ఒక్కోసారి వేలల్లో బిల్లు వచ్చినా పట్టంచుకోరు. ఎందుకంటే రెస్టారెంట్ లో ఉండే ఫుడ్ కు రేట్లు అలా ఉన్నాయని అనుకుంటాం. కానీ వీటిపై విధించే జీఎస్టీలో కొందరు రెస్టారెంట్ ఓనర్లు అతి తెలివి ప్రదర్శిస్తారు. ఇందులో ప్రధానంగా ఈ రకమైన మోసాన్ని చాలా వరకు చేస్తుంటారు.
ఉదాహరణకు ఒకసారి రెస్టారెంట్ లోకి వెళ్లి భోజనం చేశారనుకోండి. ఈ సమయంలో రూ.3000 వరకు బిల్లు అయిందని అనుకుందాం.. దీనిపై జీఎస్టీ 5 శాతం విధిస్తే రూ.150 అవుతుంది. కానీ కొందరు తెలివిగా ముందుగా పొరపాటు ఎక్కువ అమౌంట్ అనగా రూ.1000 బిల్లు వేస్తారు. ఆ మొత్తానికి జీఎస్టీ విధించి బిల్లులో యాడ్ చేస్తారు. అంటే రూ.4000లపై 5 శాతం జీఎస్టీ రూ.200 వేస్తారు. కానీ ఆ తరువాత అదనంగా, పొరపాటున పడిన రూ.1000ని తీసేస్తారు. కానీ మొత్తానికి లెక్కగట్టిన జీఎస్టీని మాత్రం అలాగే ఉంచుతారు. ఈ విధంగా రూ.50 అదనంగా చెల్లిస్తారు.
ఇలా బిల్లు ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువగా జీఎస్టీని వసూలు చేసే అవకాశం ఉంది. అందువల్ల రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ లో ఇలా జీఎస్టీ విధించినప్పుడు కచ్చితంగా పరిశీలించాలి. లేకుంటే చాలా నష్టపోతారు. అయితే బిల్లు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం తీసుకునే ఐటమ్స్ అందులో ఉన్నాయా? అని చూసుకోవాలి. ఆ తరువాత జీఎస్టిని సరిగా విధించారా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. లేకుంటే చాలా వరకు నష్టపోతారు.