Hrithik Roshan Fighter : గల్ఫ్ దేశాల్లో హృతిక్ ‘ఫైటర్’ను ఎందుకు బ్యాన్ చేశారు? అసలు వివాదమేంటి?

ఇదిలా ఉంటే గల్ఫ్ కంట్రీస్ లో నిషేధం వల్ల ఫైటర్ సినిమాకు మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Written By: NARESH, Updated On : January 24, 2024 11:57 am
Follow us on

Hrithik Roshan Fighter : బాలీవుడ్ లో దేశభక్తి సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. కానీ దేశభక్తి సినిమాలు భక్తితో ఉంటే బాగుంటుంది కానీ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటున్నాయని విమర్శిస్తున్నారు కొందరు. దీంతో బాలీవుడ్ పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా సినిమాలు బాలీవుడ్ లో ఎక్కువయ్యాయి. పఠాన్, టైగర్ వంటి సినిమాలు లెక్కకు మించి వస్తున్నాయి. అచ్చం ఇదే తరహాలో ప్రస్తుతం ఏరియల్ యాక్షన్ సినిమా ఫైటర్ కూడా రాబోతోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ వంటి స్టార్లు నటించిన ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిషేధించారు. కారణం ఏంటంటే..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫైటర్. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రిపబ్లిక్ కానుకగా జనవరి 25న అంటే రేపు విడుదలకు సిద్ధమైంది. హిందీలో ఈ సినిమా వస్తుందనే టాక్ ఉన్నా.. తెలుగులో కూడా ఈ సినిమా థియేటర్లలో రానుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి సినిమాకు విడుదలకు కొన్ని గంటల ముందే షాక్ తగలడం స్టార్ల అభిమానులను ఆందోళన చెందిస్తుంది.

పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో నిషేదించడం బాధాకరం. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింటిలో నిషేధించారు. అయితే తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల అంశాలతో తీసిన సినిమాలను గల్ఫ్ దేశాల్లో నిత్యం బ్యాన్ చేస్తుంటారు.

రీసెంట్ గా సల్మాన్ భాయ్ నటించిన టైగర్ 3 సినిమాను కూడా నిషేధించారు. అదే తరహాలో ప్రస్తుతం ఫైటర్ సినిమా కూడా బ్యాన్ అయింది. ఇక యూఏఈలో మాత్రం 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గల్ఫ్ కంట్రీస్ లో నిషేధం వల్ల ఫైటర్ సినిమాకు మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.