Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎవరూ కొట్టిపారేయలేని.. తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. 2019లో మాట్లాడిన వారందరూ ఇప్పుడు పవన్ పై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ అని అంటున్నారు. గతంలో పార్ట్ టైం పొలిటీషియన్ అన్న వారు కూడా మార్చుకున్నారు.
జనసేనలో తాజాగా నిర్మాణ పరంగా పటిష్టం అవుతున్నారు. మంగళగిరిలో క్షేత్రస్థాయిలో పొలిటీకల్ అఫైర్స్ కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నారు. జనసేనను కింది స్థాయి నుంచి బలంగా తీర్చిదిద్దుతున్నారు. జనసేన సోషల్ ఇంజినీరింగ్ కూడా కూడా బాగానే చేస్తున్నారు.
నాయకులు కొందరు జనసేన నుంచి వెళ్లిపోయినంత మాత్రానా ఏం కాదు. కొత్త నాయకులు జనసేనలోకి వస్తూ పటిష్టం అవుతున్నారు.
దేశ రాజకీయాలు నిశితంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ బలమేంటో తెలుస్తుంది.. ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.