Annamalai: అన్నామలై దెబ్బకు తోక ముడుస్తున్న ద్రవిడవాదులు, మతవాదులు

అన్నామలై దెబ్బకు తోక ముడుస్తున్న ద్రవిడవాదులు, మతవాదులు తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 21, 2023 5:00 pm

అన్నామలై మూడో విడత పాదయాత్ర రోజురోజుకు ఒక మహా ప్రవాహంలా సాగుతోంది. అందరూ మొదట బీజేపీకి పట్టున్న దక్షిణ తమిళనాడులోనే మొదలుపెట్టింది. అక్కడ జన ప్రవాహం బాగా వచ్చింది. అన్నామలైకి పేరుతోపాటు బీజేపీకి ఊపు వచ్చింది. రెండో పాదయాత్రలో కూడా అది రెట్టింపు అయ్యింది. బీజేపీ ప్రభావం లేని మూడో పాదయాత్రలో కూడా అన్నామలైకు భారీ స్పందన వచ్చింది. కోయంబత్తూరు నుంచి తిరుపూర్ వరకూ జరిగే మూడో విడత పాదయాత్రలో జనం పోటెత్తారు. ఒక పాదయాత్రను మించి రెండో పాదయాత్ర సాగుతున్నట్టు కనిపిస్తోంది.

తమిళనాడులో నాడు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల పాపులారిటీ మళ్లీ గుర్తుకు వస్తోంది. ఆ చరిష్మా ఉన్న నాయకుడు అన్నామలై అని కనిపిస్తోంది. ఇది రాజకీయ పండితులకు అంతుచిక్కని అంశంగా మారింది.

అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలు దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అన్నామలైకి భయపడుతున్నాయి. ద్రవిడవాదం 1967 తర్వాత మొదటిసారి ఆత్మరక్షణలో పడిపోయింది. అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే, డీఎంకేలు స్పందిస్తున్నాయి.

అన్నామలై దెబ్బకు తోక ముడుస్తున్న ద్రవిడవాదులు, మతవాదులు తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.