Sri Lanka China: భారత్ కు దక్షిణాన ఉన్న శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నా.. చైనా ఆధిపత్యమే కారణమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ సమయంలో శ్రీలంకకు భారత్ అపన్నహస్తం అందిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది. తమ దేశంలో నిత్యావసర వస్తువుల కొరతను అధిగమించేందుకు 1.5 బిలియన్ డాలర్లను పంపిచాలని శ్రీలంక దేశం భారత్, చైనాను అభ్యర్థించింది. కానీ భారత్ స్పందించి అవసరమైన సాయాన్ని అందించింది. చైనా ముహం తిప్పుకోవడంతో ఆ దేశ పరిస్థితి అక్కడి వారికి పూర్తిగా అర్థమైపోయింది. అయితే భారత్ ను శ్రీలకం దూరం పెట్టినా సాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు భారత్, శ్రీలంక దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి..?

భారత్, శ్రీలంకల మధ్య రెండువేల సంవత్సరాల సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. పూర్వకాలంలో అశోకుడు బౌద్ధమత ప్రచారం కోస తన కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రలను శ్రీలంకకు పంపించాడు. వీరి బోధనలకు ప్రభావితమైన అక్కడి వారు బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇప్పుడున్న శ్రీలంకలో 70 శాతానికి పైగా బుద్ధుడిని ఆరాధిస్తారు. రెండు దేశాలు బ్రిటిష్ పాలన కింద ఉండేవి. కానీ భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏడాదికి శ్రీలంక స్వతంత్ర్యంగా మారింది. అయితే 1980లో భారత్ కు చెందిన తమిళులు శ్రీలంలకలో పాగా వేశారు. తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేశారు. ఈ సమయంలో శ్రీలంక ప్రభుత్వం తరుపున భారత్ నిలబడింది. తమిళ వేర్పాటు సంస్థ అయినా ఎల్ టీటీఈని నిరాయుధాలను చేసేందుకు భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎప్) 1987లో శ్రీలంకలో పర్యటించింది.
ఈ సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కొలంబో అధ్యక్ష నివాసంలో గార్డ్ ఆఫ్ హానర్ తీసుకుంటుండగా శ్రీలంక నావిడుకు రైఫిల్ బట్ తో ఆయనపై దాడి చేశారరు. ఆ తరువాత 1991 మే 21న తమిళ వేర్పాటు సంస్థ ఎల్టీటీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసింది. అయితే శ్రీలంక విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఎల్టీటీఈ ఆయనను హత్య చేసిందని తెలుస్తోంది. ఇక ఎల్టీటీటీఈ ప్రభావం తగ్గడంతో శ్రీలంక ప్రభుత్వం వారిపై దూకుడు ప్రారంభించింది. అయితే 2009లో అంతర్యుద్ధం కారణంగా భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు హెచ్చు, తగ్గులుగా కొనసాగుతున్నాయి.
శ్రీలంకగా గత 20 ఏళ్లలో చైనాతో సంబంధాలు సాగించింది. శ్రీలంకలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం చైనా నుంచి అప్పులు తీసుకుంది. దీంతో చైనా భారీగా పెట్టుబడులు పెట్టి శ్రీలంకను అప్పుల ఊబిలోకి దించింది. అయితే నిర్వహణ లోపం, అప్రమత్తత లేని కారణంగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ సమయంలో తమను ఆదుకోవాలని భారత్, చైనాలను కోరడంతో చైనా ముహం చాటేసింది. భారత్ మాత్రం ఆపన్నహస్తం అందించింది. దీంతో చైనా, భారత్ దేశాల పరిస్థితి అక్కడి వారికి పూర్తిగా అర్థమైంది.
Also Read: ప్రగతి భవన్ VS రాజ్‌భవన్.. ప్రొటోకాల్ వార్
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ శ్రీలంకలో పర్యటించారు. ఏడు దేశాలు భాగస్వామ్యం పంచుకుంటున్న అంతర్జాతీయ సంస్థ బిమ్ స్టెక్ ఐదో సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే భారత్ ఇప్పటి వరకు 2.4 బిలియన్ డాలర్ల సాయం చేసింది. కానీ ఇలా ఒకే దేశంపై ఎంత కాలం ఆధారపడగలదు..? అని కొందరు ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం భారత్ టీ ఎగుమతిదారులకు ప్రయోజనకరంగా మరనుందని అంటున్నారు. అంతర్జాతీయ టీ మార్కెట్ లో శ్రీలంక ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఇక్కడ టీ ఉత్పత్తులు 97 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం కారణంగా 15 శాతం తగ్గుదల కనిపించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో రోజూ 12 నుంచి 13 గంటలకు కరెంట్ ఉండడం లేదని, జనరేటర్లను నడిపించేందుకు చమురు దొరకడం లేదని అక్కడి వారు వాపోతున్నారు. అయితే కొందరు మాత్రం పొరుగుదేశంలో ఏర్పడిన అస్థిరత మనకు మంచిది కాదని అంటున్నారు. ఈ ప్రభావం భారత్ పై పడుతుందని అంటున్నారు.
Also Read: ఎక్కడైనా ఉందా ఈ చోద్యం.. తమను తప్పించడంపై సీనియర్ మంత్రుల ఆగ్రహం
[…] […]