Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: బీజేపీని ఆంధ్రాలో మంచుతున్నది ఎవరు?

AP BJP: బీజేపీని ఆంధ్రాలో మంచుతున్నది ఎవరు?

AP BJP
AP BJP

AP BJP: ఏపీ బీజేపీలో చిచ్చు రగులుతోంది. రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెబుతూ చిచ్చు రగిలించి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు సైతం పార్టీనీ వీడనున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే వారందరూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజునే టార్గెట్ చేసుకుంటున్నారు. పార్టీ పెద్దల పట్ల వినయ విధేయతలను ప్రదర్శిస్తూనే సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెబుతున్నారు. అందుకే ఢిల్లీలో సైతం బలప్రదర్శనకు దిగుతున్నారు. హైకమాండ్ పెద్దలను కలిసి రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని పట్టుబడుతున్నారు. అయితే ఇలా కలుస్తున్న నేతలు తమకు తాము 30 ఈయర్స్ బ్యాక్ గ్రౌండ్ అని చెబుతున్నారు. కానీ వారు పార్టీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు.. పార్టీ వాయిస్ వినిపించింది లేదు. దీంతో సోము వీర్రాజు వర్గం అలెర్ట్ అయ్యింది. వారికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి బీజేపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరన్నది విశ్లేషించుకుంటున్నారు.

అయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే సోము వీర్రాజు నాయకత్వంపై తిరుగుబాటు చూస్తుంటే ప్రత్యర్థులు పక్కా వ్యూహంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో దశాబ్దాలుగా బీజేపీలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లు సైతం అధికం. కానీ పక్కన ఉన్న తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ బలం పుంజుకోలేకపోతోంది. అయితే దీనికి హైకమాండే కారణం. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో కొనసాగుతున్న వారు కొందరైతే.. సెంట్రల్ పవర్ చూసుకొని చేరుతున్న వారూ ఉన్నారు. ఇలా చేరుతున్న వారు మాతృ పార్టీల శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నారే తప్ప… బీజేపీ బలోపేతానికి పాటుపడడం లేదు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ రూట్లోకి రాకపోవడంతో ఇప్పుడు నాయకత్వం మార్చాలన్న డిమాండ్ తెరపైకి తేవడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉంది.

వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ ముందుకు రావడం లేదు. దీనిపై హైకమాండ్ పెద్దలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా..రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం టీడీపీతో వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో చంద్రబాబు రాష్ట్ర బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకొని ఆ పార్టీలోని అసంతృప్త నాయకులను సైకిలెక్కిస్తున్నారు. అటు హైకమాండ్ పై ఒత్తిడి పెంచి రాష్ట్ర బీజేపీని తన చెప్పుచేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో మెజార్టీ నాయకులు పొత్తును కోరుకుంటున్నారు. అయితే వారంత టీడీపీ నుంచి వచ్చిన వారే. పొత్తు ఉంటే బీజేపీ తరుపున పోటీచేయ్యాలని భావిస్తున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం పొత్తు వద్దని భావిస్తున్నారు. అందులో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ బలంగా తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. గత ఎన్నికల అనంతరం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యసభ పదవులతో ఉన్న నలుగురిని బీజేపీకి గిఫ్ట్ గా ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం వారిని టీడీపీ నేతలుగానే చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే పొత్తు ఉన్నా బీజేపీ తరపున టీడీపీ నాయకలే పోటీచేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కు నివేదించారు. అందుకే ఏపీ పరిస్థితులను పార్టీ పెద్దలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

AP BJP
AP BJP

ఇటువంటి తరుణంలో బీజేపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ హైకమాండ్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. దశాబ్దాలుగా రాష్ట్ర బీజేపీ పై జరుగుతున్న కుట్రను వర్ణించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో బీజేపీ తరుపున నిలబడి వారి విషయాన్ని వారు ప్రస్తావించారు. అటువంటి వారు మనసు నిండా పసుపు పూసుకున్నారని.. కనీసం కాషాయం గుర్తుకు రాలేని విషయాన్ని ప్రస్తావించారు. విశాఖలో ఒంటరిగా మేయర్ స్థానాన్ని గెలుచుకున్న పార్టీని ఎవరు నిర్వీర్యం చేశారో గుర్తించుకోవాలని సూచించారు. 2004లో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి సమయంలో ముందస్తు ఎన్నికలకు పురమాయించి పార్టీని ముంచిందెవరో గ్రహించాలన్నారు. జాతీయ పార్టీ ఉన్న బీజేపీ ఓ ప్రాంతీయ పార్టీ గొడుగు కింద ఉండడం వల్లే ఈ దౌర్భగ్యపు పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు. గతంలో జరిగిన తప్పిదాలను గ్రహించి హైకమాండ్ కు నివేదించడం వల్లే సోము వీర్రాజును టార్గెట్ చేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర అధ్యక్ష పీఠం తన అనుకూలమైన వ్యక్తికి అప్పగించి మరోసారి రాజకీయ డ్యామేజ్ చేయ్యాలన్నదే ఈ ప్లాన్ అంటూ సోము వీర్రాజు నాయకత్వాన్ని సమర్థిస్తూ రాసిన లేఖ ఇప్పుడు హైకమాండ్ లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular