Telangana Elections 2023: తెలంగాణలో ప్రాంతాల వారిగా ఓటరు సరళి ఎలా ఉండబోతుంది?

తెలంగాణలో ప్రాంతాల వారిగా ఓటరు సరళి ఎలా ఉండబోతుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 18, 2023 6:04 pm

తెలంగాణలో ఓటర్ సరళి ఆసక్తి రేపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ మూడోసారి అధికారం నిలుపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మూడోసారి అయినా తెలంగాణలోకి అధికారంలోకి కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు వాడుతోంది. ఇక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఓటరు నాడి ఎలా ఉందన్నది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఓటరు నాడి యూనిఫాంగా రాష్ట్రం మొత్తం ఒకేరకంగా లేదన్నది అంచనా.. మొత్తం తెలంగాణను 5 ప్రాంతాలుగా విభజిస్తే.. ఎక్కడికక్కడ విభిన్నంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బలంగా లేని చోట కొన్ని పార్టీలు గెలిచే అవకాశాలు లేవు.

తూర్పు తెలంగాణ, వరంగల్ ప్రాంతంలో 34 సీట్లు ఉంటే కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఇక్కడ ఫైట్ ఇస్తుంది..

దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మొత్తం 14 సీట్లు ఉంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది.

పశ్చిమ తెలంగాణలో 14 సీట్లు ఉంటే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటుంది. బీజేపీ కొన్ని సీట్లలో ఉంది.

హైదరాబాద్ ప్రాంతంలోని 28 సీట్లు ఉంటే.. ఇందులో ఈరోజుకు బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇందులో 7 సీట్లలో ఎంఐఎం గెలుస్తుంది. మిగతా 21 సీట్లలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ బీజేపీ బలంగా ఉంది.

ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 28 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉందని అనిపిస్తోంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన కనిపిస్తోంది.

తెలంగాణలో ప్రాంతాల వారిగా ఓటరు సరళి ఎలా ఉండబోతుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.