ODI World Cup 2023 Final : ఐసీసీ వన్డే వరల్డ్ ఫైనల్ సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. విజేత ఎవరో మరో 24 గంటల్లో తేలిపోతుంది. ఫైనల్‌లో తలపడే భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఆటగాళ్లు శనివారం నెట్ ప్రాక్టీస్‌లో బిజీగా గడిపారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల ఆధారంగా, బౌలర్లు, వాళ్లు వేసే బంతులను ఎలా ఎదుర్కొవాలో సాధన చేశారు. ఇదిలా ఉంటే.. రెండు జట్ల సారథులు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

గాంధీనగర్‌లో ఫొటో షూట్..
గుజరాత్-గాంధీనగర్‌లోని అదాలజ్ స్టెప్‌వెల్‌లో వరల్డ్‌కప్ ఫైనలిస్టులు రోహిత్‌శర్మ, ప్యాట్ కమ్మిన్స్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో వీరిద్దరూ ఫోజులిచ్చారు. ఇక వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫొటోలు దిగుతారన్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు సమీపంలోని అదాలాజ్ అనే చిన్న పట్టణంలో ఉన్న అదాలజ్ స్టెప్‌వెల్‌లో ఫొటోషూట్ జరిగింది. షూట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
పూనకాలు లోడింగ్..
మరోవైపు దేశంలో క్రికెట్ పిచ్చి ఎప్పుడూ పిక్స్‌లోనే ఉంటుంది. అయితే ఈసారి ఇండియా వరల్డ్‌కప్ ఫైనల్‌కు వెళ్లడంతో ఆ పిచ్చి పిక్స్‌ని దాటి వేరే లెవల్‌లోకి కూడా వెళ్లింది. రేపటి ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే అభిమానుల్లోఫైనల్స్ పోనకాల లోడింగ్ మొదలైంది. అటు ప్లేయర్లు ఇప్పటికే అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు.