Exit Poll 2023 : నిన్నంతా టీవీల ముందు అతుక్కుపోయారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మారుమోగిపోయింది. ఇందులో అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పోల్ ఆఫ్ పోల్స్ పేరిట అందరూ ఇచ్చిన సర్వేలపై ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేశాయి. అన్నింటిని సేకరించి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు..
ఇప్పటివరకూ ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న సర్వే సంస్థ ‘యాక్సెస్ మై ఇండియా’. ప్రదీప్ గుప్త చేసే సర్వేలు ఎక్కువ విశ్వసనీయమైనవి.. గెలుస్తాయంటే ఖచ్చితంగా గెలుస్తున్నవి ఈ సర్వేల్లో. ఇందులో స్పెషలిస్టుగా యాక్సెస్ సంస్థ ఉంది. 90 శాతం ఈయన చెప్పిన ఫలితాల్లో నిజమయ్యాయి.బీహార్ లో మాత్రమే ‘యాక్సెస్’ సంస్థ సర్వే ఫెయిల్ అయ్యింది. ఉన్న వాటిల్లో 90శాతం సక్సెస్ రేట్ ఉన్నది ‘యాక్సెస్’ సంస్థ కాబట్టే ప్రాథమికంగా దీన్నే పరిగణలోకి తీసుకుందాం..
– ఐదు రాష్ట్రాల్లో చూస్తే…
-రాజస్థాన్ లో యాక్సెస్ సంస్థ ఇచ్చిన సర్వేలో ‘కాంగ్రెస్ ’ కు ఎడ్జ్ ఉందని.. టైట్ ఫైట్ అని తెలిపారు.
-చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం ఉంటుందని తెలిపారు.
-మధ్యప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు.
ఇక యాక్సెస్ లో బీజేపీకి ఓటు బ్యాంకు చెక్కుచెదరలేనది తేలింది. మోడీ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
