Exit Polls Telangana: ఆశ్చర్యం అనూహ్యం : శ్రీఆత్మసాక్షి సర్వేలో గెలుపు ఈ పార్టీది.. ఎగ్జిట్ పోల్స్ లో ఆసక్తికర ఫలితం

రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చాలా వరకు సంస్థలు ప్రకటించాయి. శ్రీ ఆత్మసాక్షి మాత్రం అందుకు విరుద్ధమైన ఫలితాలు ప్రకటించింది. వీటిని బేస్ చేసుకునే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 1, 2023 11:56 am

Exit Polls Telangana

Follow us on

Exit Polls Telangana: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదీ నిన్న పోలింగ్ మూసిన తర్వాత చాలావరకు సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు. అయితే ఆత్మ శ్రీ సాక్షి అనే సంస్థ మాత్రం కొంచెం డిఫరెంట్ ఫలితాన్ని ప్రకటించింది. కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని, కెసిఆర్ చెప్పినట్టు కాకున్నా 58 నుంచి 63 వరకు స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 51 స్థానాల వరకు గెలుస్తుందని వివరించింది.

ఎలా సాధ్యం?

రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చాలా వరకు సంస్థలు ప్రకటించాయి. శ్రీ ఆత్మసాక్షి మాత్రం అందుకు విరుద్ధమైన ఫలితాలు ప్రకటించింది. వీటిని బేస్ చేసుకునే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని కొన్ని సంస్థలు అడ్డగోలుగా ఫలితాలు చెబుతున్నాయని, అసలు పోలింగ్ ముగియకుండా ఫలితాలు ఎలా వెల్లడిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ శ్రీ ఆత్మసాక్షి ఫలితాలను ప్రముఖంగా పేర్కొనడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. శ్రీ ఆత్మ సాక్షిని మాత్రం వెనకేసుకు రావడం విశేషం. అయితే తాను మాత్రం క్షేత్రస్థాయిలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని శ్రీ ఆత్మసాక్షి ప్రకటించింది. తాము వెల్లడించిన సర్వే వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని, గతంలో పలుమార్లు ఇదే నిరూపితమైందని ఆ సంస్థ చెబుతోంది.

మిగతా సంస్థలు కూడా..

శ్రీ ఆత్మసాక్షి కాకుండా మిగతా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాయని ప్రకటించాయి. శ్రీ ఆత్మసాక్షి తరహాలోనే టైమ్స్ నౌ సి ఎన్ ఎక్స్ 66 సీట్లు, పల్స్ టుడే సంస్థ కూడా 71 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రకటించాయి. న్యూస్ ఎక్స్ కూడా భారత రాష్ట్ర సమితి వైపు మొగ్గుచూపింది. ఇది ఏకంగా 70 స్థానాలు బే బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రకటించింది. ఆరా అనే సంస్థ భారత రాష్ట్ర సమితికి 49 స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. ఇక ప్రముఖ దినపత్రిక ఆనంద్ బజార్ పత్రిక సి ఓటర్ తో కలిసి చేసిన సర్వేలో భారత రాష్ట్ర సమితికి 54 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇక ఎన్డి టీవీ కూడా 55 స్థానాల దాకా భారత రాష్ట్ర సమితి దక్కించుకుంటుందని ప్రకటించింది. జన్కీ బాత్ అనే సంస్థ కూడా భారత రాష్ట్ర సమితికి 55 స్థానాలు వస్తాయని ప్రకటించింది. రిపబ్లిక్ సి ఓటర్ అనే సంస్థ భారత రాష్ట్ర సమితికి 60 స్థానాల దాకా వస్తాయని పేర్కొంది.. అయితే మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో భారత రాష్ట్ర సమితికి అధికారం దక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు చాలావరకు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో సమాజ్వాది పార్టీ గెలుస్తుందని ప్రకటించాయి. కానీ ఫలితాలకు వచ్చేసరికి వాటి అంచనాలు తారు మారయ్యాయి. ఇప్పుడు శ్రీ ఆత్మసాక్షి చెప్పింది నిజమవుతుందా, లేకుంటే గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతుందా అనేది డిసెంబర్ 3న తేలుతుంది.