
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అడ్డంగా దొరికిపోయింది.. ఇక అరెస్టే తరువాయి.. ఇదీ బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారం.. ఈడీ, బోడీ ఏం చేయలేదు? తెలంగాణ తలవంచదు.. ఇదీ భారత రాష్ట్ర సమితి నాయకులు ఇస్తున్న కౌంటర్. ఈ వాదోపవాదాలు జరుగుతుండగానే.. ఈడి అధికారులు కవితను విచారిస్తున్నారు. అది కూడా దఫా దఫాలుగా.. అయితే ఈ విచారణ క్రమంలో కవిత ఈడి అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారు ఈడీ అధికారులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోయారు..కానీ కవిత అలా కాదు. అలా ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికీ మాత్రం పరిస్థితి క్యాట్ అండ్ మౌస్ లాగా ఉన్నది. రోజుకో తీరుగా ప్రచారం జరుగుతున్నది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో.. ఆమెను విచారించాలని దర్యాప్తు సంస్థ అధికారులు భావించారు. ఆమెను ఢిల్లీకి రమ్మని కబురు పంపారు.. కాని తాను విచారణకు ఢిల్లీ రాలేవని, మీరే హైదరాబాద్ రావాలని దర్యాప్తు సంస్థల అధికారులకు తేల్చి చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే అధికారులు కూడా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాలు నేపథ్యంలో కవిత ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ కూడా కవిత తనకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రశ్నించింది. ఘాటయిన లేఖలు కూడా రాసింది. అయితే ఈడి వ్యవహారంలో కవిత కాన్ఫిడెంట్ వెనుక ఒక మాస్టర్ మైండ్ కీలకంగా వ్యవహరిస్తోంది. అతడి పేరు సోమా భరత్.. భారత రాష్ట్ర సమితి లీగల్ విభాగంలో కీలకంగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదేశాల మేరకే కవిత ఈడీ కి దీటుగా బదులిస్తోంది.
మార్చి 11న విచారణకు హాజరైన కవితను దర్యాప్తు సంస్థ అధికారులు నిరవధికంగా ప్రశ్నించారు. మళ్లీ మార్చి 16న రమ్మన్నారు. ఆరోజున కవిత ఉదయం 11:30 నిమిషాలు దాటిన తర్వాత కూడా విచారణకు హాజరు కాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అంతు పట్టలేదు. అప్పుడు ఉన్నట్టుండి ఒక పేరు బయటకు వచ్చింది. పేరు సోమా భరత్ కుమార్. కవిత తరఫున ఈ డి డైరెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లాడు. కవిత రాసిన లేఖను అధికారులకు సమర్పించాడు.సోమా భరత్ కుమార్ కెసిఆర్ కుటుంబానికి నమ్మిన బంటులాగా వ్యవహరిస్తున్నాడు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన భరత్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట. వృత్తిరీత్యా ఇతడు సీనియర్ అడ్వకేట్. రంగా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితికి ఏర్పడిన న్యాయపరమైన చెక్కులను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కెసిఆర్ భరత్ కుమార్ ను భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. అంతేకాదు 2022లో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించాడు. ప్రగతి భవన్ కు పిలిచి మరీ కెసిఆర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
తాజాగా కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి భరత్ కుమార్ క్రియాశీలకంగా మారారు. న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొనేందుకు కవిత దాదాపుగా భరత్ కుమార్ ని నమ్ముకున్నారు. అందు గురించే ఆమె అంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. పైగా మంగళవారం పది సెల్ ఫోన్లు మీడియాకు చూపించడం వెనక కూడా భరత్ కుమార్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది