
Ranga Maarthaanda Collections: మంచి సినిమాలను జనాలు ఆదరించడం లేదు, ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కావాలి అని కొంతమంది ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి తెగ గోల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తీరా మంచి సినిమా చేసి విడుదల చేసినప్పుడు మాత్రం కనీస స్థాయిలో కూడా జనాలు ఆదరించడం లేదు. అందుకు ఉదాహరణగా నిల్చింది ఈరోజు విడుదలైన ‘రంగ మార్తాండ’ అనే చిత్రం.
కృష్ణ వంశీ లాంటి లెజండరీ డైరెక్టర్ అతి తక్కువ ఖర్చు తో కేవలం కంటెంట్ ని ప్రధాన తారాగణం నటనని నమ్ముకొని తీసాడు.మరాఠీ లో సెన్సేషనల్ హిట్టైన ‘నట సామ్రాట్’ అనే చిత్రానికి ఇది రీమేక్. ప్రివ్యూ షోస్ నుండే ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ విడుదలకు ముందే కలిగించిన ఈ సినిమా, విడుదల తర్వాత కూడా అదే రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చింది.టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం నిల్.
ఈ చిత్రం తో పాటుగా నేడు ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమా కూడా విడుదలైంది.దానికి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ విపరీతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘రంగమార్తాండ’ కి మాత్రమే వసూళ్లే లేవు.’ధమ్కీ’ చిత్రానికి మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటుంటే,’రంగమార్తాండ’ చిత్రానికి కనీసం 50 లక్షల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా రాబట్టలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ కి మధ్య ఇంత వ్యత్యాసం ఉండడానికి కారణం కమర్షియల్ ఎలిమెంట్స్.

‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి పోతే పాటలు ఫైట్స్ , కామెడీ ఇవన్నీ ఉంటాయి.అదే ‘రంగమార్తాండ’ కి పోతే కుటుంబ విలువలు గురించి ఉంటుంది.జనాలు కమర్షియల్ సినిమాకే చివరికి పెద్ద పీట వేశారు. అయితే ‘బలగం’ సినిమాలాగే ఈ చిత్రం కూడా రెండవ రోజు నుండి వసూళ్లు పుంజుకొని సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అంటున్నారట, చూడాలి మరి వాళ్ళ నమ్మకం నిలుస్తుందో లేదో అనేది.