Homeఆంధ్రప్రదేశ్‌Janasena and TDP alliance : జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు పై బీజేపీ ఏమ‌నుకుంటోంది?.. 2024...

Janasena and TDP alliance : జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు పై బీజేపీ ఏమ‌నుకుంటోంది?.. 2024 ఫ‌లితాలు ఇలా ఉంటాయా?

Janasena and TDP alliance : 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్పుడే బీజేపీ ఓ అంచనాకు వస్తోందా ? జ‌న‌సేన, టీడీపీ పొత్తు ప్ర‌భావం పై క్లారిటీ ఉందా ? ప‌వ‌న్, చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరా ? జ‌గ‌న్ పై బీజేపీ వైఖ‌రిలో మార్పు ఉండ‌దా ? అంటే అవుననే జవాబు వ‌స్తోంది. ఏపీ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ముందుకు వెళ్లే సంకేతాలిస్తోంది.

ఏపీలో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయ‌మ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మేర‌కు జ‌న‌సేనాని ర‌ణ‌స్థ‌లంలో సంకేతాలిచ్చారు. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే త‌రువాయి. 2024 ఎన్నిక‌ల‌కు బీజేపీని కూడ క‌లుపుకుపోవాల‌ని ఆలోచ‌న టీడీపీ, జ‌న‌సేన‌లో ఉంది. అందుకే ప్ర‌తిప‌క్షాల ఓటు చీలనివ్వం అనే వైఖ‌రిని జ‌న‌సేన‌, టీడీపీ తీసుకున్నాయి. టీడీపీ, జ‌న‌సేన వైఖ‌రి పై బీజేపీ సైలెంట్ గా ఉంది. ప‌రిస్థితులు నిశితంగా గ‌మ‌నించి అడుగేయాల‌ని ఆలోచిస్తోంది.

ఏపీలో టీడీపీ, జ‌న‌సేకు 2024 ఎన్నిక‌లు చాలా కీల‌కం. అందులోనూ టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మస్య‌. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్తే టీడీపీకి లాభం త‌ప్పా, బీజేపీకి వ‌చ్చేది కొన్ని మంత్రి ప‌దవులు, ఎమ్మెల్యే స్థానాలు అనే స్ప‌ష్ట‌త‌ను బీజేపీ జాతీయ నేత‌లు ఏపీ నేత‌లికిస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్లినా జ‌గ‌నే సీఎం అయితే.. టీడీపీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. అప్పుడు టీడీపీ స్థానాన్ని బీజేపీ భ‌ర్తీ చేయ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో కేంద్ర పెద్ద‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఫ‌లితంగా రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేతం కావొచ్చు. బీజేపీ ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉంటే జ‌గ‌న్ కు ఎలాగూ కేసులు ఉన్నాయి కాబ‌ట్టి వాటిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావొచ్చ‌ని బీజేపీ నేత‌లు అంచ‌నాలు వేస్తున్నార‌ట‌.

జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు మ‌ళ్లీ ఓటు వేస్తే సీఎం జ‌గ‌నే అవుతాడ‌ని బీజేపీ పెద్ద‌లు లెక్క‌లు క‌డుతున్నార‌ట‌. కొంత ఓటు బ్యాంకు చీలినా ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద‌గా అడ్వాంటేజ్ అవ్వ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. జ‌గ‌న్ వ‌ల్ల ల‌బ్ధిపొందిన వారు ఓటు వేయ‌ని ప‌క్షంలోనే టీడీపీ, జ‌న‌సేన‌కు ఓటు బ‌దిలీ అవుతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. అలాంట‌ప్పుడు టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్ల‌డం వ‌ల్ల ఒరిగేదేమీ లేదంటున్నార‌ట‌. ఇప్ప‌టికే జ‌గ‌న్ మొద‌టి నుంచి సానుకూల వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ తో పేటీ ఎందుక‌ని ఏపీ బీజేపీ నేత‌ల్ని కేంద్ర పెద్ద‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. పొత్తుల‌తో స్వ‌ల్ప లాభాల కంటే ఏపీలో బ‌ల‌ప‌డటం పైనే దృష్టి పెట్టాల‌ని సూచిస్తున్నార‌ట‌.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version