Veerasimha Reddy vs Walthair Veeraiah : ‘వీరసింహారెడ్డి’ నష్టాలను పూడుస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం

Veerasimha Reddy vs Walthair Veeraiah : ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో జాక్ పాట్ కొట్టిన నిర్మాత ఎవరైనా ఉన్నారా అంటే అది మైత్రి మూవీస్ మేకర్స్ అనే చెప్పాలి.. ఏ నిర్మాత కూడా చేయని సాహసాలు ఈ సంక్రాంతికి వీళ్లు చేశారు. ఒకే బ్యానర్ లో చిరంజీవి మరియు బాలయ్య లాంటి టాప్ స్టార్స్ ని పెట్టుకొని సినిమాలు చెయ్యడమే కాకుండా, ఆ రెండు సినిమాలను ఒక్క రోజు గ్యాప్ తో సంక్రాంతికి […]

Written By: NARESH, Updated On : January 16, 2023 10:01 pm
Follow us on

Veerasimha Reddy vs Walthair Veeraiah : ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో జాక్ పాట్ కొట్టిన నిర్మాత ఎవరైనా ఉన్నారా అంటే అది మైత్రి మూవీస్ మేకర్స్ అనే చెప్పాలి.. ఏ నిర్మాత కూడా చేయని సాహసాలు ఈ సంక్రాంతికి వీళ్లు చేశారు. ఒకే బ్యానర్ లో చిరంజీవి మరియు బాలయ్య లాంటి టాప్ స్టార్స్ ని పెట్టుకొని సినిమాలు చెయ్యడమే కాకుండా, ఆ రెండు సినిమాలను ఒక్క రోజు గ్యాప్ తో సంక్రాంతికి విడుదల చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు.

ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే ఎవ్వరూ అలా చెయ్యలేదు..అలాంటి సాహసానికి ఒడిగట్టి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ అధినేత నవీన్.. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకొని బాగా ఆడుతున్నాయి.. కానీ ‘వీర సింహా రెడ్డి’ సినిమాకంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అద్భుతంగా ఆడుతుంది..ఎక్కడ చూసిన ఈ మూవీ టికెట్స్ కోసం ఒక మినీ యుద్ధమే జరుగుతోంది.

కానీ ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మాత్రం మాస్ ప్రాంతాలలో మినహా మిగిలిన చోట్ల పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు..అలాంటి ప్రాంతాలలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్ళు ‘వీర సింహా రెడ్డి’ థియేటర్స్ లోకి దూరిపోతున్నారు.. అలా నష్టాలు రావాల్సిన చోట్ల వీర సింహా రెడ్డికి వాల్తేరు వీరయ్య వల్ల థియేటర్స్ నిండుతున్నాయి.. ఎటు చూసుకున్న నిర్మాతకి సేఫ్..ఇలా జరగడం చాలా అరుదు.. వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలకు జరిగింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా హోల్డ్ చెయ్యాల్సిన అవసరం ఉంది..’అఖండ’ సినిమాకి ముందు బాలయ్య మార్కెట్ పాతిక కోట్లకు మించి ఉండేది కాదు..కానీ ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ 75 కోట్ల రూపాయలకు ఎగబాకింది.. వీకెండ్ కి 50 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగాడు.. అంటే బాలయ్యకి ఈమధ్య కాలంలో క్రేజ్ బాగా పెరిగింది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు.