spot_img
Homeజాతీయ వార్తలుNarendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు. తనకు 56 ఇంచుల భారీ చాతి ఉందని.. తాను దేనికి భయపడనని పదేపదే చెప్పుకునే మోడీ.. ఇప్పుడు ఏకంగా బొద్దింకలను చూసి భయపడి పోవడం.. ఏకంగా తన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడం.. ఒకరకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడి ఓటమి..

బిజెపి ఐటి సెల్ విస్తృతంగా పనిచేస్తున్న వేళ.. జాతీయ భావజాలం ఉన్నవారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్న వేళ.. నరేంద్ర మోడీ రెండు సెల్ఫీ వీడియోలు విడుదల చేసిన వేళ.. ఇక కాక్రోచ్ జనతా పార్టీ కథ ముగిసిపోయిందని.. అజిత్ దోవల్ రంగంలోకి వచ్చాడని.. తొక్కినార తీస్తాడని అందరు అనుకుంటున్న వేళ.. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా మారిపోయింది.. అసాంఘిక శక్తుల మీద ఉక్కు పాదం మోపాల్సిన సమయంలో.. ఇలా నరేంద్ర మోడీ సరెండర్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చేతిలో ఇండియన్ జేమ్స్ బాండ్ లాంటి అజిత్ దోవల్ ఉన్నాడు. శక్తివంతమైన సైన్యం ఉంది. అన్నిటికీ మించి అమిత్ షా ఉన్నాడు.. ఏది చెప్తే దానికి ఊ కొట్టే మంత్రివర్గ ఉంది. ఇన్ని రకాల సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఎవడో బొద్దింకల నాయకుడు డిమాండ్ చేస్తే నరేంద్ర మోడీ తలవంచడమేంటి. తన మంత్రితో రాజీనామా చేయించడం ఏంటి.. ఈ ఘటన తర్వాత నరేంద్ర మోడీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. ఒక రకంగా ఆయన ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు.

నరేంద్ర మోడీ గొప్ప నాయకుడని.. అసాంఘిక శక్తుల మీద ఉక్కు పాదం మోపుతారని అందరికీ ఒక నమ్మకం ఉండేది. కానీ ఈ దేశానికి ఇప్పటికే కాదు.. ఎప్పటికీ కావాల్సింది ఒక యోగి లాంటివాడే. మోడీ ఎందుకు భయపడతాడు.. నిలబడతాడు.. కలబడతాడు.. తొక్కినారతీస్తాడు అని చాలామంది అనుకున్నారు. కానీ అదంతా తప్పని.. తనకు అంత సీన్ లేదని నరేంద్ర మోడీ నిరూపించాడు.. నరేంద్ర మోడీ వెనక్కి తగ్గాడు అంటే.. తొక్కేస్తాడు గట్టిగానే.. యూట్యూబర్లు ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదా..

ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడు.. ఒక ఎన్జీవో ను ఏర్పాటు చేసి.. దానిద్వారా డబ్బులు పోగేసి.. కేసులు ఎదుర్కొంటున్నవాడు.. తన స్నేహితుడితో పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు కలిగి ఉన్నవాడు.. చైనాతో చర్చలు జరిపిన వాడు.. ఇంకా జాతిని విచ్ఛిన్నం చేసేందుకు వ్యాఖ్యలు చేసినవాడు.. అటువంటి వాడి కోసం నరేంద్ర మోడీ భయపడ్డాడా.. నరేంద్ర మోడీ వెనుకడుగు వేశాడా.. దేశం ఇబ్బంది పడుతున్న వేళ.. అరాచక శక్తులు ఉద్యమాలు చేస్తున్న వేళ నరేంద్ర మోడీ సరైన అవడం ఏంటి..

ఇప్పటివరకు ప్రతి జాతి అభిమాని.. జాతిని ప్రేమించే అభిమాని నరేంద్ర మోడీని చూసుకొని గర్వపడేవాడు. నరేంద్ర మోడీని ఉద్దేశించి మై ప్రైడ్ అని చెప్పుకునేవాడు. ఇకపై దానికి అవకాశం లేదు. దానికి ఆస్కారం లేదు. సో కాల్డ్ సన్నాసులకు.. సో కాల్డ్ అరవింద్ కేజ్రీవాల్.. నటసార్వభౌమ రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు ఇకపై అవకాశం దక్కినట్టే.. సింహం తలవంచితే గుంటనక్కలు ఊలలు వేస్తాయి.. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసింది కూడా అదే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
Oktelugu Epaper
Exit mobile version