Homeఆంధ్రప్రదేశ్‌MP Family Kidnap : క్రైం సినిమాలా ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ స్టోరీ..గగుర్పొడిచే నిజాలివీ

MP Family Kidnap : క్రైం సినిమాలా ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ స్టోరీ..గగుర్పొడిచే నిజాలివీ

MP Family Kidnap : వారికి వ్యవస్థలంటే లెక్కలేదు. జాలి, దయ, ప్రేమ అస్సలు కనిపించదు. మనిషి అని చూడరు. క్రూర మనస్తత్వంతో వ్యవహరిస్తారు. వినడానికి ఇదేదో వెబ్ సీరిస్ కథలా ఉంది కాదు. ఇది రీల్ స్టోరీ కాదు. రీయల్ స్టోరీ. విశాఖ ఎంపీ కుమారుడు, భార్య, ప్రముఖ ఆడిటర్ కిడ్నాప్ కేసులో గజ నేరగాళ్లు చూపించిన భయానక స్థితిగతులు తలచుకొని బాధితులు ముగ్గురు వణికిపోతున్నారు. తమకు ఎదురైన పరిణామాలు చెప్పి ఆందోళన చెందుతున్నారు. డేగ గ్యాంగ్ గా చెప్పుకునే ఆ బృందంలో 8 మంది సభ్యులు ఉండగా,,, ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చిత్రవధ చేస్తూ బాధితులకు చుక్కలు చూపించారు. క్రైమ్ సినిమా తరహాలో,,, బాధితుల ఆర్తనాదాలతో పైశాచిక ఆనందం పొందారు.

కిడ్నాప్ నకు గురైంది సాక్షాత్ అధికార పార్టీ ఎంపీ కుటుంబసభ్యులు. సీఎం జగన్ కు సన్నిహితుడైన ఆడిటర్ జీవీ. వారు కిడ్నాప్ నకు గురైంది ముందురోజు. కానీ ఎంపీతో పాటు పోలీసులకు తెలిసింది మరుసటి రోజు. అంటే కిడ్నాపర్లు ఎంతలా ప్రణాళిక రూపొందించుకున్నారో అర్ధమవుతోంది. తొలుత ఎంపీ కుమారుడ్ని, ఆ తరువాత భార్యను, అటు తరువాత ఆడిటర్ ను ట్రాప్ చేశారంటే ఎప్పటి నుంచి రెక్కీ నిర్వహించారో ఇట్టే తెలుస్తోంది. బాధితుల మెడపై కత్తిపెట్టి తమకు అనుకూలంగా మాట్లాడించారు. తొలుత ఒక్కడితో ప్రారంభించి.. గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారంటే వారి నేర చరిత్ర ఏపాటితో అర్ధమవుతుంది.

రెండురోజుల పాటు బాధితులకు నరకం చూపించారు. వారి ముందే గంజాయి, మద్యం తాగుతూ భయానక వాతావరణం సృష్టించారు. ఎంపీ కుమారుడితో పాటు ఆడిటర్ ను విచక్షణారహితంగా కొట్టారు. ఆడిటర్ ను చంపేస్తామని బెదిరించి రాత్రికి రాత్రే రూ.1.70 కోట్లు డ్రైవర్ ద్వారా తెప్పించుకున్నారు. బాధితుల ముందే డబ్బులు వాటాలేసుకున్నారు. ఎంపీ భార్య ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసి పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్లు హేమంత్, గాజువాక రాజేష్ లది అగ్రవాటా కాగా.. మిగతాది  ఆరుగురు పంచుకున్నారు. గాజువాక రాజేష్ చర్యలను తలచుకొని బాధితులు భయపడుతున్నారు. ఓ నిందితుడైతే ఏకంగా తన ప్రియురాలికే బందీగా ఉన్న ఒకరితో ఫోన్ చేయించి మాట్లాడించాడు. బయటకు వచ్చాక రూ.40 లక్షలు ముట్టజెబుతానని హామీ ఇప్పించాడు. కిడ్నాప్ నగదు నాకు వద్దంటూ ప్రియురాలి భయపడితే.. అది మనకు అప్పుగా ఇవ్వాల్సిన నగదు అని సదరు నిందితుడు చెప్పుకొచ్చాడు.

అక్కడితో వారి చర్యలు ఆగలేదు. తమకు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్నాయని చెప్పారు. కిడ్నాప్ లు, దందాలు చేసే ముఠాలతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థలు తమకేం చేయలేవని తేల్చేశారు. మహా అయితే ఓ నెలరోజుల పాటు జైలులో ఉంచుతారని.. తరువాత బయటకు వచ్చి తమ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు. కిడ్నాప్ ఘటన ప్రాంతం పోలీసులకు తెలియడంతో ఎంపీ కుమారుడ్ని బ్యాటుతో కొట్టి కారు డిక్కీలో కుక్కేశారు. ఆడిటర్ జీవిని సైతం కుక్కే ప్రయత్నం చేశారు. అలా అయితే తాను చనిపోతానని కాళ్లావేళ్లా బతిమలాడడంతో కనికరించారు. కారులో చోటిచ్చారు. ఈ విషయాలన్నీ చెబుతూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. కళ్లల్లో బందీలుగా ఉన్న నాటి గురుతులు స్పష్టంగా కనిపించాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular