మారుతున్న కాలంతో పాటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది జంక్ ఫుడ్ ను కొనుగోలు చేయడానికి, తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసినా ప్రజలు జంక్ ఫుడ్ రుచిగా ఉంటుందని.. తక్కువ సమయంలో తయారు చేసుకునే అవకాశం ఉండటం, ఆర్డర్ చేసే అవకాశం ఉండటంతో జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.
Also Read: కొవిడ్-19 నిబంధనలను మరోసారి పొడగించిన కేంద్రం..!
ప్రముఖ సంస్థలు జంక్ ఫుడ్ పై ఇచ్చే ఆఫర్లు సైతం ఈ ఫుడ్ ను ఎక్కువమంది కొనుగోలు చేయడానికి కారణమవుతున్నాయి. జంక్ ఫుడ్ రోజూ తినేవారు బరువు పెరగడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. రోజూ జంక్ ఫుడ్ తింటే ఒబెసిటీ సమస్య వేధిస్తుంది. రోజురోజుకు ఒబేసిటీ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుండటంతో యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా…?
2022 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి జంక్ దుడ్ ను ప్రమోట్ చేస్తూ ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉప్పు, సాఫ్ట్ డ్రింక్స్, చక్కెర, కొవ్వు ఉన్న పదార్థాలకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వకూడదని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలు జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా చేయవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్ణయం అమలుకు చాలా సమయం ఉండటం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం
యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది. అక్కడి అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జంక్ ఫుడ్ వినియోగం తగ్గడంతో పాటు ఒబెసిటీ సమస్యతో బాధ పడే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. చిన్నారులు సైతం ఒబెసిటీ బారిన పడుతుండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.