టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చేతికి స్మార్ట్ వాచీతో సీఎం రమేశ్ ఆలయం లోపలికి ప్రవేశించడం వివాదాస్పదమైంది.
Also Read: బీజేపీ సీఎం అభ్యర్థి సౌరభ్ గంగూలీయేనా?
టీటీడీ నిబంధనల ప్రకారం భక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులతో లోపలికి వెళ్లడం నిషేధం. ఈ మేరకు దేవాదాయ శాఖ చట్టం ప్రకారం దీన్ని నేరంగా భావిస్తారు. సీఎం రమేశ్ చేతికి ఆపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఉంది.
అయితే ఆలయ సెక్యూరిటీ దాన్ని గమనించకపోవడంతో అలాగే ఆయన ఆలయంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం అని తెలిసి కూడా సీఎం రమేశ్ ఇలా నిబంధనలు అత్రికమించాడని పలువురు విమర్శిస్తున్నారు.
Also Read: రైతులకు ‘టైం’ ఫిక్స్ చేసిన కేంద్రం..!
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల యూకే నుంచి భారత్ వచ్చిన కరోనా వైరస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్థించానని తెలిపారు. తిరుపతిలోనూ బీజేపీ గెలవాలని కోరుకున్నట్టు చెప్పారు. కొద్దిరోజుల క్రితమే సీఎం రమేశ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలోనే దైవ దర్శనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్