దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అదుపులోకి వచ్చే సమయంలో కొత్తరకం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తరకం కరోనా పేరు వింటే ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1363 మంది రాగా అందులో ఇప్పటివరకు 12 మంది కరోనా వైరస్ నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Also Read: కొవిడ్-19 నిబంధనలను మరోసారి పొడగించిన కేంద్రం..!
అయితే కొత్తరకం కరోనా గురించి ఎక్కువగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కొత్తరకం కరోనాపై అద్భుతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నూటికి నూరు శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకుంటే కొత్తరకం కరోనా బారిన పడమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
Also Read: కరోనా వ్యాక్సిన్ల ఇమ్యూనిటీ పిల్లలకు మంచిదా..? కాదా..?
అతి త్వరలో ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇతర కరోనా వ్యాక్సిన్లు కూడ కరోనా కొత్త స్ట్రెయిన్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తరకం కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు కేంద్ర హోం శాఖ కరోనా ఆదేశాలకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
జనవరి 31వ తేదీ వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్రం నిబంధనలు అమలులో ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్ల విషయంలో కఠినంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.