https://oktelugu.com/

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టిన పార్టీ సమావేశం ముగిసింది.. లోటస్ పాండ్ కు భారీగా వైఎస్ అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా జనసమూహం మధ్య షర్మిల బయటకొచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2021 / 01:40 PM IST
    Follow us on

    కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టిన పార్టీ సమావేశం ముగిసింది.. లోటస్ పాండ్ కు భారీగా వైఎస్ అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా జనసమూహం మధ్య షర్మిల బయటకొచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

    ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్ఆర్ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడా.. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా..’ షర్మిల తెలిపారు.

    ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణా సంచా కాలుస్తూ నృత్యాలతో సందడి చేశారు. ‘వైఎస్ఆర్ అభిమానులారా తరలిరండి’ అంటూ షర్మిల పిలుపునిచ్చారు.

    వైఎస్ తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పనిచేసిన వారికి షర్మిల తరుఫున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. ఫ్లెక్సీల్లో ఎక్కడా సీఎం జగన్ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలనే ఏర్పాటు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలపై మాత్రం క్లారిటీ రాలేదు.