Homeప్రత్యేకంTour : రూ.10 వేలలోపు విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరించండి.. ఛార్జీల వివరాలు ఇవే..

Tour : రూ.10 వేలలోపు విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరించండి.. ఛార్జీల వివరాలు ఇవే..

Tour : సమ్మర్ హాలిడేస్ రాగానే చాలా మంది టూర్ కు ప్లాన్ వేస్తారు. కొంచెం ఆదాయం ఉన్నవాళ్లు ఇతర దేశాల్లోకి వెళ్లి విహరించాలనుకుంటారు. అయితే ఫ్లైట్ ఎక్కాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రయాణ టికెట్ తో పాటు ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయని విదేశీ టూర్ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో విదేశాల్లో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా అందమైన ప్రదేశాల్లో విహరించి ఆనందంగా గడపొచ్చు. మరి తక్కువ ఖర్చుతో వెళ్లే విదేశీ టూర్ల వివరాలేంటో చూద్దామా..

Nepal
Nepal

ట్రెక్కింగ్ వారి కోసం.. (నేపాల్)
అంత్యంత ఎత్తైన హిమలయాలు కలిగి ఉన్న దేశం నేపాల్. ఇది పరిమాణంలో చిన్నదైనా సాహస యాత్రికులకు కేంద్రంగా ఉంటుంది. అద్భుతమైన పర్వతాలు, ఎగురుతున్న విఖరాలు, నింతరం ట్రెక్కింగ్ ట్రయల్స్, దట్టమైన అడవులు ఆకట్టుకుంటాయి. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఖాట్మాండ్, ఫోఖారా, అన్నపూర్ణ, చిత్వాన్ నేషనల్ పార్క్ ఉన్నాయి. ఇక్కడికి నవంబర్ నుంచి మార్చి వరకు వెళ్లడం బెటర్. ఢిల్లీ నుంచి ఖాట్మాండ్ వరకు ‘ఇండిగో’ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి రూ.5,471 ఛార్జిని వసూలు చేస్తారు. ముంబై నుంచి రూ.6,862 ధర ఉంది.

Yala Park (Sri Lanka)
Yala Park (Sri Lanka)

యాల పార్క్ (శ్రీలంక):
భారత్ కు దక్షిణాన ఉన్నచిన్నదేశం శ్రీలంక. ఈ దేశానికి, మనకు నిత్యం సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత టూరిస్టులు కూడా శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. శ్రీలంకలో యాలా పార్క్ వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇక్కడ చిరుతపులులు, ఏనుగులు, కోతులు, మొసళ్లతో పాటు అనేక రకాలైన వన్యప్రాణులు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓ అందమైన సరస్సు కూడా ఉంది. వీటితో పాటు మహా విహారయా యొక్క పురాతన అవశేషాలను చూడొచ్చు. ఇక్కడ కొలంబో, కాండీ, సిగిరియా, గాలే పోర్ట్, ఆడమ్స్ బ్రిడ్సి తదితర ప్లేసులను చూడొచ్చు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. శ్రీలంక దేశానికి పలు రాష్ట్రాల నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి కొలంబోకు రూ.7,050, కోయంబత్తూర్ నుంచి కొలంబోకు రూ.8,981 ధరలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునేవారు చెన్నై వెళ్లి అక్కడి నుంచి వెళ్లడం ఉత్తమం.

Vietnam
Vietnam


సూపర్ బీచ్ వెకేషన్ (వియత్నాం):

బీచ్ ప్రేమికులను వియత్నాం మంచి వెకేషన్. 200 మైళ్ భారీ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న వియత్నాంలో సహజమైన బీచ్ లు, ప్రవహించే నదులు, బౌద్ధ గోపురాలు ఆకర్షిస్తాయి. ఇక్కడ చిరస్మరణీయమైన డానాంగ్ బీచ్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. క్రిప్టల్ క్లియర్ వాటర్ ల బెడ్ లో పడుకున్న పగడపు దిబ్బల అందమైన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఈ దేశంలో హలోంగ్ బే, హో చి మన్ సిటీ, చారిత్రాత్మక పట్టణం, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్ వంటివి చూడొచ్చు. ఇక్కడికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్.. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సందర్శించవచ్చు. వియత్నాంను సందర్శించేవారు ముందుగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ‘ఇండిగో’ ఎయిర్ లైన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఎస్ జీఎన్ కు రూ.9,183 చార్జిని వసూలు చేస్తారు. ముంబై నుంచి కూడా వెల్లొచ్చు. కానీ ఇక్కడ రూ.10,550 ధర ఉంది.

Thailand
Thailand

వెల్నెస్ కోసం..(థాయ్ లాండ్)
సుధీర్ఘమైన యోగా, వెల్నెస్ ను కోరుకునేవారు థాయ్ లాండ్ మంచి టూరింగ్ స్పాట్. యోగా నేర్చుకునేవారికి కూడా ఇది స్వర్గధామం. వీటితో పాటు మార్షల్ ఆర్ట్స్, సర్పింగ్, డైవింగ్ వంటి విభిన్న పరిమాణాలు ఇక్కడ ఆకర్షించబడుతాయి. ఇక్కడ బ్యాంకాక్, హువా హిన్, ఫుకెట్,పట్టాయా, ఫై ఫై ఐలాండ్, కో స్యామ్యూయ్, క్రాబి ప్రదేశాలు ఆకర్షిస్తాయి. నవంబర్ నుంచి మే మధ్యలో ఇక్కడికి వెళ్లడం ఉత్తమం. కొచ్చి నుంచి బ్యాంకాక్ కు ‘ఏయిర్ ఇండియా’ ఫ్లైట్ అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి రూ.10,747 చార్జి వసూలు చేస్తారు. ఢిల్లీ నుంచి రూ.10,778 ధర ఉంది.

Turkey
Turkey

చారిత్రక ప్రదేశాలు (టర్కీ):
చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు టర్కీకి వెళ్లడం ఉత్తమం. ఒకప్పుడు గ్రీకు, రోమన్, బైజాంటైన్, ఒట్టోమన్ సామ్రజ్యాల చరిత్ర ఇక్కడ నిక్షిప్తం. యూనెస్కో వరల్డ్ హెరిటేస్ సైట్ లతో టర్కీ నిండి ఉంది. ఈ దేశంలో ఇస్తాంబుల్, కప్పడోసియా, ఆయా సోఫియా, బ్లూ మసీదు, ట్రాయ్, ట్రాబ్లోన్, అంటాల్య, పముక్కలే, ఎఫెసర్, స్పైస్ మార్కెట్ లాంటివి చూసి ఆనందించొచ్చు. ఇక్కడికి హే నుంచి సెప్టెంబర్ వరకు వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి టర్కీకి వెళ్లాలనుకునే వారు ముందుగా ముంబై వెళ్లాలి. అక్కడి నుంచి ఇస్తాంబుల్ కు ‘కువైట్ ఎయిర్ వేస్’ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి రూ.22,546 చార్జి వసూలు చేస్తారు. తిరువనంతపురం నుంచి ‘గల్ఫ్ ఎయిర్’ వెళ్తుంది. ఇక్కడి నుంచి రూ.32,523 ధర ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular