
Agent Pre-release Event : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు.
చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ ని చూసాము అంటూ సెన్సార్ సభ్యులు మూవీ టీం ని పొగడ్తలతో ముంచెత్తారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తాడంటూ ప్రచారం జరిగింది, కానీ అవన్నీ రూమర్స్ అని ఈరోజుతో తేలింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తెలంగాణలోని వరంగల్ ప్రాంతం లో రంగలీల మైదానం లో జరగనుంది.ఈ ఈవెంట్ కి అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నాడట.దీనితో ఇన్ని రోజులు ప్రభాస్ రాబోతున్నాడు, రామ్ చరణ్ రాబోతున్నాడు అనే వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.వాస్తవానికి ప్రభాస్ కోసం మూవీ టీం మొత్తం ప్రయత్నం చేసిన విషయం వాస్తవమే.
కానీ ఆయన ప్రాజెక్ట్ K షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల చివరి నిమిషం లో రాలేను అని మూవీ టీం కి చెప్పేసాడు.దీనితో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో చూడొచ్చు అని ఆనందపడిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.ఇక ఏజెంట్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.రేపు లేదా ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుంది.