‘పంచాయితీ’ గెలిచిన జనసేన.. మున్సిపోల్ లోనూ తొడగొడుతోంది!

ఏపీ పంచాయతీ ఎన్నికలు అధికార వైసీపీకి.. ప్రతిపక్ష టీడీపీకి కంటి మీద కునుకులేకుండా చేశాయి. వైసీపీ మెజార్టీ పంచాయతీలు గెలిచానా.. కీలకమైన మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, ఇలాకాలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికలు నిద్రలేని రాత్రిని మిగిల్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ ఓడిపోయి ఆ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్మేలా చేశాయి. కానీ జనసేన మాత్రం దూసుకొచ్చింది. పవన్ ప్రచారానికి రాకున్నా.. పర్యవేక్షించకుండా […]

Written By: NARESH, Updated On : February 25, 2021 12:04 pm
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికలు అధికార వైసీపీకి.. ప్రతిపక్ష టీడీపీకి కంటి మీద కునుకులేకుండా చేశాయి. వైసీపీ మెజార్టీ పంచాయతీలు గెలిచానా.. కీలకమైన మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, ఇలాకాలో ఘోర ఓటమిని చవిచూసింది.

ఇక ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికలు నిద్రలేని రాత్రిని మిగిల్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ ఓడిపోయి ఆ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్మేలా చేశాయి.

కానీ జనసేన మాత్రం దూసుకొచ్చింది. పవన్ ప్రచారానికి రాకున్నా.. పర్యవేక్షించకుండా హైదరాబాద్ లో ఉండిపోయినా కూడా జనసైనికులు సత్తా చాటారు. ఏకంగా మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకొని అధికార వైసీపీ, టీడీపీలకు షాకిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలు ఆ పార్టీలో అంతులేని జోష్ ను నింపాయి. ఇప్పటికే దీనిపై పవన్, నాగబాబు స్పందించారు. తాజాగా జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

మొత్తంగా ఏపీలో 1209 మంది సర్పంచ్ లు, 1576 మంది ఉప సర్పంచులు జనసేన గెలిచిందని అధికారికంగా ప్రకటించారు. ఇక గ్రామాల్లోని 4456 వార్డులు కూడా గెలిచామని జనసేన పార్టీ తెలిపింది.పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఏపీ వ్యాప్తంగా చూస్తే ఇది 27శాతం అని విజయాలను గొప్పగా జనసేన చాటి చెప్పింది.

పంచాయతీల్లో జనసైనికులు సాధించిన ఘనత చూసి ఇప్పుడు ఏపీలో జరిగే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లోనూ ఆ పార్టీలో జోష్ వచ్చింది. పంచాయతీల్లో ఎలాగైతే స్వేచ్ఛగా పార్టీ శ్రేణులను వదిలేశారో.. ఇప్పుడు మున్సిపల్ లోనూ అలాగే వదిలేస్తే జనసేన అద్భుత విజయాలు సాధించడం ఖాయమన్న చర్చ సాగుతోంది.

పట్టణాల్లో జనసేన ఇంకా బలంగా ఉంటుంది. పవన్ ఫ్యాన్స్, అభిమాన గణం ఎక్కువ. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీచేసి యువతకు టికెట్లు ఇస్తే పంచాయతీ ఎన్నికలను పునరావృతం చేస్తామని జనసైనికులు చెబుతున్నారు. పవన్ రాకున్నా.. జనసేన నేతలు నజర్ పెట్టకపోయినా పంచాయతీలో అద్భుతాలు చేసిన జనసైనికులు ఇప్పుడు మున్సిపల్ లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.కేవలం పార్టీ గుర్తు, అండదండలు ఇస్తే చాలు తాము మున్సిపల్ లోనూ దున్నేస్తామంటున్నారు. దీంతో పవన్, నాదెండ్ల సహా జనసేన నేతలు కూడా మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో జనసైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అదే జరిగితే మున్సిపల్ లోనూ అధికారవైసీపీ, టీడీపీకి షాక్ తగలడం ఖాయం. టీడీపీకి ప్రత్యామ్మాయంగా జనసేన నిలబడడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి.