
Times Now Navbharat Survey: మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. అయితే ఇందులో ఎవరు అధికారం సాధిస్తారు?. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు అనే ప్రశ్నలకు కీలకమైన సమాధానం వచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, ఈ టీజీ రీసెర్చ్ సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.. ఓట్ల శాతం పరంగా చూస్తే బిజెపికి 38.2%, కాంగ్రెస్ పార్టీకి 28.7%, ఇతరులకు 33.1% ఓట్లు వస్తాయని ఆ సంస్థల సర్వేలో తెలింది.
ఈ సర్వేలో ఆ సంస్థలో ప్రధానంగా అడిగిన ప్రశ్న కాబోయే ప్రధానమంత్రి ఎవరు అని? అయితే ఈ జాబితాలో సర్వేలో పాల్గొన్న ఓటర్లు మరో మాటకు తావు లేకుండా మోదీకి జై కొట్టారు. ప్రధానికి అనుకూలంగా 64 శాతం మంది ఓటు వేశారు. రాహుల్ గాంధీకి 13 శాతం మంది సమ్మతం తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ కు 12%, నితీష్ కుమార్ 6%, కేసీఆర్ కు 5% ఓట్లు వచ్చాయి.
ఇక ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ కూర్చోవాలని 29%, అరవింద్ కేజ్రివాల్ 19%, మమతా బెనర్జీ 13%, నితీష్ కుమార్ 8%, కేసీఆర్ 7%, దాచిన రుస్తమ్ తో 24% మంది తమ నిర్ణయం తెలిపారు. ఇక ఈ సర్వేలో 2024 లో బిజెపి 300 సీట్లకు పైగా గెలుస్తుందా అని ప్రశ్నించినప్పుడు.. దానికి 42 శాతం మంది అవును అను సమాధానం చెప్పారు. అదే సమయంలో 26 శాతం మంది 300 సీట్లు కష్టమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నాటికి తేలిపోతుందని 19 శాతం మంది తేల్చి చెప్పారు. 13 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.

2024 లోపు ప్రతిపక్షాలు ఏకతాటి పైకి వస్తాయా అనే ప్రశ్నకు 31 శాతం మంది అవును అని చెప్పారు. 26 శాతం మంది ప్రజలు ప్రతి ఒక్క పార్టీకి సొంత ఎజెండా ఉందని వివరించారు. ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందని 26% మంది అభిప్రాయపడ్డారు. ఇక ఈ సర్వేలో కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు బాగుందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరోవైపు అవినీతి విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శించియని 17 శాతం మంది వివరించారు. దేశంలో డబ్బు తిరిగి వస్తుందని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మిగిలిన మూడు ప్రశ్నలతో 21 శాతం మంది ప్రజలు ఏకీభవించారు.. ఇక ప్రధానమంత్రి మోదీ పని తీరు పట్ల 51% ప్రజలు సంతృప్తిగా ఉన్నామని చెప్పారు.. 16% మంది చాలా చాలా బాగుందని చెప్పారు. 12 శాతం మంది పర్వాలేదు అని వివరించారు. 21శాతం మంది బాగోలేదన్నారు.. ఇక మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో కోవిడ్ ను పారదోలడమని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రజలు ఆర్టికల్ 370 రద్దు చేయడం పెద్ద విజయమని, రామ మందిర నిర్మాణానికి అడుగులు వేయడం 29 శాతం మంది, ప్రజా సంక్షేమ పథకాలకు మద్దతుగా 17 శాతం మంది, అవినీతిపై చేసిన పోరాటం అతిపెద్ద విజయం అని 19 శాతం మంది తమ నిర్ణయం వెలువరించారు..
ఇక తాజా సర్వే తో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఖాయమైంది. అంటే అన్నిసార్లు ఈ సర్వే ఫలితాలు నిజం కావాలని లేదు. అయితే ఈ సర్వే పై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఫేక్ సర్వే అని కొట్టి పడేస్తున్నారు. మరోవైపు ఏపీలో జగన్ పార్టీ హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన సర్వేలో వెళ్లడైంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఆంధ్ర ప్రజలు మరొకసారి జగన్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు అంతంతమాత్రంగానే సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. 2019 ఎన్నికల్లో దేశ్ కీ నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవ పరిస్థితిలో ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.. ఇప్పుడు కూడా నాలుగు లేదా ఐదు సీట్లకు మించి రాకపోవచ్చని సర్వే చెబుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.. వరుస వైఫల్యాలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి..25 నుంచి 35 మధ్య అసెంబ్లీ సీట్లు సాధించే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది.. స్థానిక ఎమ్మెల్యేల నిర్వాకం వల్లే తాము ఇబ్బంది పడుతున్నామని మెజారిటీ ప్రజలు చెప్పడం విశేషం.