
Upasana Seemantham: మెగా ఫ్యామిలీలోకి మరి కొద్ది రోజుల్లో వారసుడు రాబోతున్నాడు. కొణిదెల వారి కోడలు ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇది మెగా కుటుంబాన్ని ఆనందంలో ముంచేస్తుంది. కాగా ఉపాసనకు ఏడో నెల వచ్చినట్లు సమాచారం. దీంతో సీమంత వేడుక నిర్వహించారు. చిరంజీవి నివాసంలో బుధవారం ఉపాసన సీమంత వేడుక జరిగింది. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా తెలియజేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు.
ఉపాసన సీమంత వేడుకలో తండ్రి కాబోతున్న రామ్ చరణ్ మురిసిపోతున్నారు. ఆయన ఆనందం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కాగా ఆల్రెడీ దుబాయ్ లో ఒకసారి సీమంతం నిర్వహించారు. దుబాయ్ వేడుకల్లో రామ్ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ లేరు. ఉపాసన సిస్టర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. మరలా హైదరాబాద్ లో సీమంత వేడుక నిర్వహించారు.

రామ్ చరణ్-ఉపాసనలకు వివాహం జరిగి పదేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు వారసుల కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఇన్నేళ్లు పిల్లల్ని కనక పోవడం వెనుక కారణం ఉందని ఉపాసన స్వయంగా వెల్లడించారు. పెళ్ళైన వెంటనే రామ్ చరణ్-ఉపాసన ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారట. ఇద్దరూ కెరీర్లో సెటిల్ అయ్యే వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నారట.
పదేళ్ల తర్వాతే పిల్లలని టైం పీరియడ్ కూడా పెట్టుకున్నారట. సమాజం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా మేము మా అగ్రిమెంట్ బ్రేక్ చేయలేదని ఉపాసన తెలిపారు. ప్రస్తుతం ఉపాసన యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ సైతం అందుకుంది. కాబట్టి 2023 రామ్ చరణ్ కి చాలా స్పెషల్…