Pawan Kalyan: ప్రజాభిమానం నిండుగా ఉన్న నాయకుడు ప్రజల్లోకి వస్తే ఇంకా ఏమైనా ఉందా? మీద పడిపోతారు. పవన్ కళ్యాణ్ లాంటి వారినైతే జనాల్లో వదిలేస్తే అభిమానులు ఎగబడిపోతారు. అందుకే పవన్ వస్తే బందోబస్తు కాస్త గట్టిగానే ఉంటుంది. తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే బాధితుల ఇళ్ల వద్దకు వస్తుంటే అశేషమైన పవన్ ఫ్యాన్స్ అడుగడుగునా పవన్ కోసం పోటెత్తుతున్నారు. వారందరినీ దాటుకొని వెళ్లడం పవన్ కు కష్టసాధ్యమవుతోంది.

భారీగా పోలీస్ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చుట్టూ బాడీ గార్డులు.. పదుల సంఖ్యలో పోలీసుల స్టిక్ట్ కారిడార్ మధ్య పవన్ ముందుకు సాగారు. అయినా జనం తోసుకుంటూ పవన్ ను కలవాలని ఆరాటపడుతూనే ఉన్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారం అవుతోంది.
ఈ క్రమంలోనే పవన్ నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఎగబడ్డ అభిమానుల తాకిడీకి పవన్ కు రక్షణగా ఉన్న ఒక పోలీస్ అధికారి కిందపడిపోయాడు. దాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ పోలీస్ ను లేపి మరీ యోగక్షేమాలు తెలుసుకొని ముందుకు సాగాడు.
ఇలా పవన్ కళ్యాణ్ అంత బిజీలోనూ ఓ పోలీస్ కిందపడిపోతే స్పందించిన తీరు.. ఆయనలోని మానవత్వానికి మచ్చుతునకగా చెప్పొచ్చు. పవన్ ఇలా తోటి వారిపై చూపే ప్రేమ, కరుణనే ఆయనను గొప్ప మనిషిగా తీర్చిదిద్దింది. ఇలాంటి ఘటనలతోనే పవన్ కళ్యాణ్ లోని రియల్ హీరో బయటకు వస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
[…] Acharya Dharmasthali: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం కొరటాల శివ వరుస ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ మాట్లాడుతూ.. ‘ఆచార్య సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్ టౌన్ కావాలనుకున్నాం. మేము చాలా ప్రాంతాలు చూసి వచ్చాం. కాకపోతే, మాకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి. అందుకే, అవ్వన్నీ ఒక చోట చేర్చి ‘ధర్మస్థలి’సృష్టించాం. […]
[…] Amravati: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అప్రదిష్ట మూటగట్టుకున్నందున రాబోయే కాలంలో దాని నుంచి బయట పడాలని చూస్తోంది. ఇందుకు గాను ఇప్పటి నుంచే అన్ని దారులు వెతుకుతోంది. గతంలో మూడు రాజధానుల వ్యవహారంతో విమర్శలే ఎదుర్కొంది. అందుకే ఇక ప్రజల ఆగ్రహానికి గురయ్యే పనులు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మెటీరియల్ వస్తుండటంతో నిర్మాణాలు ఇక వేగవంతం పుంజుకుంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. […]
[…] Balakrishna- Siddu Jonnalagadda: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కుడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఇంటర్వెల్ కి ఫుల్ కామెడీగా సినిమా టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందట. […]