https://oktelugu.com/

కొత్త కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు..?

దేశంలో చాలామందికి కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి క్షేమంగా, సురక్షితంగా కారులో వెళ్లే అవకాశం ఉండటం వల్ల చాలామంది కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఏడాదిలో కార్ల ధరలకు రెక్కలు వచ్చినప్పటికీ దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్తకారును కొనుగోలు చేయాలనుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి. Also Read: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు లేనట్లే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2021 4:37 pm
    Follow us on

    Car Loans
    దేశంలో చాలామందికి కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి క్షేమంగా, సురక్షితంగా కారులో వెళ్లే అవకాశం ఉండటం వల్ల చాలామంది కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఏడాదిలో కార్ల ధరలకు రెక్కలు వచ్చినప్పటికీ దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్తకారును కొనుగోలు చేయాలనుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి.

    Also Read: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు లేనట్లే..?

    చౌక వడ్డీకే బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉండటంతో కొత్తకారు కొనుగోలు చేయాలనుకునే వారికి కారును కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారికి 7.50 శాతం వడ్డీకి రుణాలను ఇస్తోంది. సమీపంలో ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి కొత్త కారు ఆఫర్లను సులభంగా తెలుసుకోవచ్చు.

    Also Read: అమ్మఒడి పథకంలో చేరేవారికి అలర్ట్.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..?

    ఎస్బీఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.55 శాతం వడ్డీరేటుకు కార్ లోన్ ఇస్తోంది. పారా మిలిటరీ, డిఫెన్స్ వాళ్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేవలం 7.3 శాతం వడ్డీకే కార్ లోన్లను ఆఫర్ చేస్తుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ 8 శాతం వడ్డీరేటుకు కార్ లోన్లను ఆఫర్ చేస్తోంది.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    ఐసీఐసీఐ బ్యాంక్ లో కార్ లోన్ తీసుకున్న వాళ్లు ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ రుణాలు ఇవ్వడంతో పాటు కారు మోడల్ ను బట్టి రుణం మంజూరు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 8.8 శాతం వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారా 100 శాతం డబ్బులను లోన్ గా తీసుకునే అవకాశం ఉంటుంది.